విలువలను పెంచేదే విద్య

Teacher
Teacher

  నిషిని ఉన్నతంగా తీర్చిదిద్దేది, మూర్తిమత్వాన్ని పెంపొందించేది, అంతర్గత శక్తులను బయటకు తీసేది, విలువలను పెంచేది, గమ్యాన్ని చూపిస్తూ మనస్సును సంపూర్ణంగా వికసించేటట్లు చేసేది, వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దేది, ప్రకృ తిలో సర్దుబాటుకు తోడ్పడేది, భావిజీవిత సవాళ్లను అధిగమిం చేందుకు శక్తినిచ్చేది విద్య అని తరచుగా విద్యాలక్ష్యాల గురించి మనం చెప్పుకుంటున్నాం. అనేక పాఠ్యాంశాల ద్వారా ఏడాది పొడవ్ఞనా బోధించిన విద్య ద్వారా ఎంతో కొంత విద్యాలక్ష్యాలు సాధించబడతాయని ఆశిస్తుంటే, పరీక్షల సమయంలో కొన్ని ప్రశ్న లు ఇచ్చి వాటికి పిల్లల్ని తయారు చేసి పరీక్షల నుండి బయట పడేసే నేటి చదువ్ఞల ద్వారా వ్యక్తిత్వం వికాసం, వ్యక్తి నిర్మాణం జరుగుతుందని ఆశించడం అత్యాశే అవ్ఞతుంది. మరి అలాంటప్పు డు వేలకోట్ల రూపాయలతో పెట్టుబడిపెట్టి నడుస్తున్న పాఠశాలలు ఏం సాధిస్తున్నట్లు? నేటి సమాజంలో టి.వి.లు, సినిమాలవల్లనైతే నేమీ, యాంత్రిక జీవితం వల్లనైతేనేమీ అనేక సామాజిక రుగ్మలతో సమాజం నిండి ఉంది. విద్యార్థులు క్షణికావేశానికి గురై తల్లిదండ్రు లు తిట్టారనో, ఉపాధ్యాయులు మందలించారనో ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఇటీవల మనం చూస్తున్నాం. పరీక్షలలో ఉత్తీర్ణత చెందలేదని, అనుకున్న ర్యాంక్‌ రాలేదని, ఎదుటివారు అవమానపరిచారని అర్ధాంతరంగా తనువ్ఞలు చాలిస్తున్నారు. మొక్కై వంగనిది మానై వంగునా? దేశ భవిష్యత్తుకు ఉపయోగ పడే శక్తి వ్ఞన్న నేటి యువత ఇలా అనర్థాలకు బలికావలసిందేనా? విద్యావిధానంలో అనేక మార్పులు, ప్రయోగాలు చేసివిద్యార్థులను బలి తీసుకుంటున్నామా? ఒకసారి పరిశీలిస్తే…ఆంగ్లమాధ్యమం, ప్రైవేట్‌ చదువ్ఞల ప్రాబల్యం వల్ల నేటి విద్యార్థి నిరంతరం తీవ్ర ఒత్తిడికి గురవ్ఞతున్నాడు. మానసిక బలహీనత, న్యూనతాభావం కూడా మరికొన్ని కారణాలు. స్థాయికి మించి తల్లిదండ్రుల ఆకాంక్ష లు, అవి తీర్చలేక పిల్లల వ్యధలు దాదాపు ప్రతి ఇంటిలో మనం చూస్తున్నదే ఎందుకిలా? ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలోఅందరు కలిసి ఉండి పిల్లలకు మానసికంగా బలం చేకూర్చేవారు. అప్పుడు ఎక్కడైనాన తప్పు చేయడానికి అవకాశం తక్కువ. ఒకవేళ జరిగిన ఆ తప్పును పెద్దవాళ్లు సరిదిద్దేవారు. వెన్నెల రాత్రుల్లోసాయంత్రం పూట అమ్మమ్మ చెప్పే నీతికథలు, తాతయ్య పాడే చక్కడిపద్యాలు పిల్లలకు స్ఫూర్తివంతంగా ఉండి, మనలో విలువలను తట్టిలేపి, వ్యక్తిత్వ వికాసాన్ని నింపేవి. ఈ రకంగా బంధాలు, అనుబంధాలు తెలిసేవి. ఇప్పుడు బామ్మలు, అమ్మమ్మలు సాయంత్రం అయితే చాలు ప్రైమ్‌టైంలో వచ్చే క్రైమ్‌ సీరియళ్లు చూస్తూ విరామం మధ్య లో పిల్లలకు వంటచేస్తున్నారు. ఇటీవల కాలం వరకు కూడా గ్రామీణ ప్రాంతాల్లో సంబంధాలు బలంగా ఉండటం, రాకపోకలు, మానవ సంబంధాలు బలంగా ఉన్ననాడు సామాజిక రుగ్మతలు తక్కువగా ఉండేవి. కానీ నేటి యాంత్రిక జీవనంలో పక్కవారితో కూడా కనీస సంబంధాలు లేని నేటి స్థితిలో తల్లిదండ్రులిద్దరు ఉద్యోగాలు చేయడం, పిల్లలను హాస్టళ్లలో నిర్బంధంగా ఉంచడం మార్కుల టార్గెట్‌ పెట్టడం విద్యార్థులు ఒత్తిడికి గురికావడానికి కారణంగా భావించాలి. పిల్లలు హాస్టల్‌లో తల్లిదండ్రులు ఆశ్రమా లలో ఉంటే ఆ పిల్లలకు బంధాల బంధం గురించి అనుబంధాల అందం గురించి రంగరించి చెప్పేదెవరు?యాంత్రిక జీవితం వలన పిల్లలు సహజత్వాన్ని కోల్పోయి మానసిక బలహీనులవ్ఞతారు. సోషల్‌ మీడియా బాగా పెరిగిపోయి పక్కవారితో సంతోషంగా, ఆత్మీయంగా మాట్లాడలేకపోతున్నారు. సినిమాలలో సోషల్‌ మీడియాలో వచ్చే హింస, అశ్లీలత పిల్లల మనుసులపై తీవ్రమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి. టీవీలలో వచ్చే అర్థంపర్థం లేని సీరియళ్లు, అసహజమైన బూతు కార్యక్రమాలు పిల్లల లేతమన సుల ఎదుగుదలపై ఎంతో అనర్థాన్ని కలిగిస్తున్నాయి. ఒక చిన్న సమస్య వచ్చినా తట్టుకోలేకపోవడం, చిన్న సంఘటనకే బిత్తరి చూపులు చూడటం, ఎవరికి చెప్పుకోవాలో తెలియక తెలిసీ తెలియని వారితో ముచ్చటించడం ఇలాంటి పరిస్థితిలో ఉన్న విద్యలు చదివి పట్టాలు ఎన్ని పొందినా వారిలో విలువలు నశించి వికృతంగా ప్రవర్తించడం. ప్రేమ, అభిమానాలు, మర్యాద, మన్న నలు, కృతజ్ఞత సహనాలను కోల్పోవడం. దరిమిలా రకరకాల అఘాయిత్యాలకు పాల్పడటం మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. సమాజానికి, తల్లిదండ్రులకు నిజమైన విద్య అంటే ఏమిటో తెలి యకపోవడమే అసలు సమస్య. ఈ మధ్యకాలంలో విద్య విలువని మనం భూమి విలువతోనో, స్టాక్‌ ఎక్చేంజ్‌ షేర్లతో వ్యాపారం చేసే విధంగనో బేరీజు వేస్తున్నాం. విద్యార్థి ఏ చదువ్ఞతోనైతే ఎక్కువ సంపాదించగలుగుతాడో ఆ విద్యనే మనం ప్రోత్సహిస్తున్నాం. అంతేకాని చదువ్ఞకున్న వారి శీలగుణాలు అభివృద్ధిచెందే విధానం గురించి ఆలోచించం. ఇరుకు గదుల్లో, ఐదారు అంతస్తుల బిల్డింగు లలో విద్యార్థుల భవిష్యత్తుకై కుస్తీలు జరుగుతుంటే ఆటలంటే కంప్యూటర్‌ ముందు కూర్చుంటున్నారు. ఇటువంటి పరిస్థితులు ఉన్నంతకాలం విద్య నిజమైన విలువను తెలుసుకుంటామని ఆశించలేం. విద్య అనగా వెలికి తీయడం. ప్రకృతి ప్రతి మానవ్ఞ నికీ అంతర్‌-జ్ఞానాన్ని ప్రసాదించి ఉంటుంది. దానిని వెలికి తీయ డమే విద్యపని. చరిత్ర ఆరంభం నుంచి విద్య వికసిస్తూ, ఎన్నో విభాగాలుగా విస్తరిస్తోంది. ప్రతిదేశం విద్యాశైలి తనదైన సామాజిక సాంస్కృతిక అస్థిత్వాన్ని వ్యక్తపరిచే విధంగానూ, పరిస్థితుల సవా లును స్వీకరించే విధంగానూ ఉంటుంది.విద్య అనేది చాలా ముఖ్య మైనది. ఓ సంఘం అభివృద్ధిచెందాలంటే అందులోని ప్రజల విద్యావివేకాలపై ఆధారపడి ఉంటుంది. విద్య వెలుగునిస్తుంది. విద్య వివేకాన్నిస్తుంది. దీనిని భారతీయ సమాజం ఆది నుండి గుర్తించింది. తొలినాళ్ల నుండి విద్యకు చక్కని ప్రాముఖ్యత ఉన్నది. పురాతన కాలంలో విద్యను మనిషి మూడవ కన్నుగా భావించారు. జ్ఞానానికి మార్గంగా ఈ చదువ్ఞను భావించారు. చిన్ననాటి నుండే వ్యక్తిత్వ వికాస విద్య బోధించబడాలి. తద్వారా విద్యార్థులు ఊహా లోకంలో కాకుండా నిజ జీవితంలో జీవిస్తారు. భ్రమలకు లోను కారు. కనుక విపరీత పరిణామాలు చోటుచేసుకోవ్ఞ. దీనిద్వారా ప్రతిదానికి ఆలోచించి, పరిష్కరించే నేర్పు, సమయస్ఫూర్తి, సంద ర్భోచిత చర్యలు అలవడతాయి. విజయం ఆశిస్తారే కాని తగిన చర్యలు తీసుకోరు. దానికి శ్రమను ఆయుధంగా చేసుకోవాలని, నిరంతర సాధన, పట్టుదల, కార్యదీక్షతో ముందుకెళ్లాలని చెపుతూ నే ఈ స్పృహలేకపోతే అపజయం పాలవ్ఞతామని తెలిచేయాలి. కాళంరాజు వేణుగోపాల్‌

రచయిత: సీనియర్‌ ఉపాధ్యాయుడు)