విరాట్-అనుష్క‌ల పెళ్లిపై కాసేప‌ట్లో అధికారిక ప్ర‌క‌ట‌న‌?

virat, anushka
virat, anushka

ఢిల్లీః టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ వివాహ బంధంతో ఒక్క‌టి కావ‌డానికి ఇటలీకి వెళ్లిన విష‌యం తెలిసిందే. వారి పెళ్లి ముగిసిన‌ట్లు తెలుస్తోంది. ఈ విష‌యంపై మ‌రికాసేప‌ట్లో అధికారికంగా ప్ర‌క‌ట‌న చేస్తార‌ని స‌మాచారం. కాగా, కోహ్లీ, అనుష్క‌ల రిసెప్ష‌న్ ఇండియాలోనే జ‌ర‌గ‌నున్న‌ట్లు స‌మాచారం. త‌మ‌ పెళ్లిపై వ‌స్తోన్న వార్త‌ల‌పై కోహ్లీ, అనుష్క శ‌ర్మ ఇంత‌వ‌ర‌కు స్పందించ‌లేదు. వారి కుటుంబ స‌భ్యులు కూడా ఈ స‌మాచారాన్ని చెప్ప‌డానికి ఒప్పుకోలేదు. పెళ్లిపై కోహ్లీ లేక అనుష్క శ‌ర్మ కుటుంబ స‌భ్యులు ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉన్న‌ట్లు
స‌మాచారం.