విరాట్‌ వంద సెంచరీలు అవలీలగా చేయగలడు

azahruddin, kohli
azahruddin, kohli

హైదరాబాద్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో కోహ్లికిది 39వ సెంచరీ కావడం విశేషం. కోహ్లి నిలకడ అద్భుతంగా ఉంది. అతను ఫిట్‌గా ఉండగలిగితే వంద సెంచరీలు మార్క్‌ను అందుకోగలడు అని అజార్‌ అన్నాడు. నిలకడ విషయానికొస్తే ఎంతో మంది గొప్ప ప్లేయర్స్‌ కంటే ఎంతో ముందున్నాడు. అతడు సెంచరీ చేసినపుడు టీమ్‌ ఓడిన సందర్భాలు చాలా తక్కువ అని అజర్‌ అన్నాడు.