విమాన ప్రమాదం..ఐదుగురు మృతి

plane-crash
plane-crash

వాషింగ్టన్‌ : అమెరికాలో జరిగిన ఓ చిన్న విమాన ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో విమానంలో పైలట్‌తో పాటు ఐదుగరురు ప్రయాణికులు ఉన్నారు. వీరిలో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అట్లాంటాలోని ఓ కళాశాలలో ఎల్‌ఎస్‌యూ, ఒక్లహామా జట్ల మధ్య జరగనున్న ఫుట్‌బాల్‌ పోటీని తిలకించడానికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. లూయిసానాలోని విమానాశ్రయం నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే విమానం కుప్పకూలింది. పోస్టాఫీస్‌ పార్కింగ్‌ స్థలంలో కూలడంతో అక్కడే ఉన్న ఓ కారు పూర్తిగా దగ్ధమైంది. ఆ సమయంలో కారులో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డట్టు స్థానికులు తెలిపారు. విమానంలో ఓ ప్రముఖ స్పోర్ట్స్‌ జర్నలిస్టుతో పాటు ఫుట్‌బాల్‌ జట్టు సభ్యుల బంధువులు, కళాశాల సిబ్బంది ఉన్నట్టు సమాచారం.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/