విమర్శించడం కంటే ప్రార్థన ధన్యత

Jesus111
Jesus

విమర్శించడం కంటే ప్రార్థన ధన్యత

‘ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు (1 కొరంథీ 13:4-6). ప్రేమ గురించి ఎంత చెప్పుకునా తక్కువే అనిపిస్తుంది. దేవ్ఞడు మానవ్ఞడిని ఎంతో ప్రేమిస్తున్నాడు. అందుకనే తన స్వరూపాన్ని మానవ్ఞడికి ఇచ్చాడు. దేవ్ఞడు ఆదామును సృష్టించిన తర్వాత, ఆయనకు ఒక తోడు కావాలని, హవ్వను ఆదాము పక్కటెముకను తీసి, ఆమెను తయారు చేసాడు. ఆదాము హవ్వను చూసిన మొట్టమొదటిసారిగా ఆనందంతో తబ్బిఉబ్బిపోయాడు.

ఆమెను చూడగానే ప్రేమ అతడిలో ఉప్పొంగిపోయింది. అనురాగపు కవితను వల్లించాడు. కానీ ఆ సంతోషం, ప్రేమ ఎక్కువకాలం ఆదాములో నిలబడలేదు. హవ్వ దేవ్ఞడు తినవద్దన్న పండును తిని, ఆదాముకు ఇచ్చింది. వారిద్దరు తిన్నతర్వాత తాము దిగంబరులని గుర్తించి, ఒకరినొకరు చూసుకోలేకపోయారు. అందుకే వెంటనే అంజూరపు ఆకులతో కుట్టి, వాటిని దుస్తులు గా ధరించుకున్నారు. ఆ పండును తినకముందు వారిద్దరు దిగంబరులుగా ఉన్నా, ఆ విషయాన్ని గుర్తించలేకపోయారు. ఇప్పుడు దేవ్ఞడు ఆదామును పిలిచినప్పుడు, వారిద్దరు తోట చెట్ల మధ్య దాక్కున్నారు. దేవ్ఞడికి భయపడ్డారు. దేవ్ఞడు నేను తినవద్దని పండును తిన్నావా? అని ప్రశ్నించాడు.

వెంటనే ఆదాము తినలేదు, లేదా తిన్నాను అని ఏదో ఒక సమాధానం చెప్పాలి. ఈరెండింటికి విరుద్దంగా ‘నాతో నుండుటకు నీవ్ఞ నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకియ్యగా నేను తింటిననెను (ఆది 3:12). ఎప్పుడైతే దేవ్ఞడి ఆజ్ఞను తృణీకరించారో వారిలో పాపం ప్రవేశించింది. తద్వారా భార్యాభర్తలైనా ఆదాము తప్పు హవ్వదని చెప్పాడే కానీ, తనది కాదన్నాడు. హవ్వ కూడా సర్పం నన్ను మోసగించింది, అని చెప్పిందే కానీ, తప్పు చేశానని ఒప్పుకోలేదు. తద్వారా ఇద్దరూ ఏదెను తోట నుంచి గెట్టివేయబడ్డారు. ఒకవేళ ఆదాము నిజంగా ప్రేమతో నింపబడి వ్ఞంటే, హవ్వ తప్పు చేసినా, తనదిగా ఒప్పుకుని ఉంటాడు. పాపం వల్ల ఇద్దరిలో స్వార్థం ప్రవేశించింది. ప్రేమ ఆవిరైపోయింది. ఇదే నేటి దంపతుల్లో ప్రవహిస్తున్న భావజాలం. నువ్ఞ్వ హవ్వను ఇవ్వకపోతే నేను ఆ పండును తినివ్ఞండేవాడిని కాదు అనేవిధంగా దేవ్ఞడితోనే ‘నాతో నుండుటకు నీవ్ఞ నాకిచ్చిన ఈ స్త్రీ అని చెప్పాడే తప్ప నా భార్య అని చెప్పలేకపోయాడు. తద్వారా ఇద్దరూ దేవ్ఞడి ఆశీర్వాదాలను పొందేందుకు బదులుగా శాపాన్ని పొందారు.

దేవుడి నుంచి దూరమైపోయారు. నేడు అనేక కుటుంబాలు కూడా ఇదే స్థితిలో ఉన్నాయి. విశ్వాసులు, ఎంతో ప్రార్థనాప రులు సైతం ఆధ్యాత్మికంగా కుటుంబాలు బలపడడం లేదు. కారణం ఎంతసేపూ భార్యలు భర్తలపై తప్పులను ఎత్తిచూపిస్తే, భర్తలు భార్యల లోపాలను, తప్పులను చూపిస్తూ, విమర్శించుకుంటూ ఉంటారు. ఇది విశ్వాసుల గృహాల్లోనే జరగడం విచారకరం. నెహెమ్యా తన ప్రార్ధనలో తన పితరుల పాపాన్ని, తన తండ్రి ఇంటివారి పాపాలను ఒప్పుకుంటూ ప్రార్ధన చేశాడు.

తద్వారా నెహెమ్యా పాడైపోయిన దేవ్ఞడి మందిరాన్ని తిరిగి నిర్మించగల్గాడు. మనం మన భాగస్వాములు, కుటుంబ సభ్యుల తప్పులను ఎత్తిచూపిస్తూ, విమర్శిస్తున్నంత కాలం దేవ్ఞడి ప్రత్యక్షతను చూడలేం. ఆయన ప్రేమలో వర్ధిల్లలేం. సంఘాలను నిర్మించలేం. దేవ్ఞడి ఇంటిని వృద్ధి చేయలేం. అందుకే పౌలు ప్రేమ అన్నింటిని ఓర్చుకుంటుంది అన్నాడు. భార్యాభర్తల మధ్య పరిపూర్ణమైన ప్రేమ, అనురాగం ఉన్నప్పుడు విమర్శించడం మానేస్తారు. మౌనంగా ప్రార్థన చేస్తారు. తప్పులు ఏవైనా తమపై వేసుకుని, కన్నీటితో దేవ్ఞడి పాదాలకు కడిగేందుకు ఇష్టపడతారు. ఇలాంటివారే దేవ్ఞడికి కావాలి. ఇలాంటివారే దేవ్ఞడి మందిరాన్ని నిర్మించగలరు

. ‘మా ఆయన తాగుతాడు, తిడతాడు, పిల్లల్ని, ఇంటిని పట్టించుకోడు, ఆయన బాగుంటే మేం బాగుంటాం అని చెబుతూ, తమ దుస్థితికి భర్తే కారణం అని చెబుతూ, అదే మార్పులేని జీవితంలోనే జీవిస్తుంటారు. ప్రార్థనలో పట్టుదల ఉంటే, విమర్శించడం మానేసి, తప్పులను ఇతరులపై వేసే అలవాటును మానుకుని, మౌనంగా వ్ఞండిచూడండి. మీ భాగస్వామిలో మార్పును మీరే గమనిస్తారు. కాబట్టి ఆదాము స్వభావం నుంచి బయటపడి, యేసుక్రీస్తు స్వభావాన్ని ధరించుకుందాం. ఆయన ఏ నేరం, తప్పు, పాపం చేయకపోయినా, మనకోసం సిలువలో మరణించాడు. దేవ్ఞడే మనల్ని ఇంతగా ప్రేమిస్తుంటే, మనం కూడా మన కుటుంబ సభ్యుల బలహీనతలు, చెడు అలవాట్లు ఏవైనా కానివ్వండి విశ్వాసంతో ప్రార్థిద్దాం. దేవ్ఞడు అట్టి కృపను మనకు అనుగ్రహించునుగాక.

– పి.వాణీపుష్ప