విభజన హామీలను నెరవేర్చాలి

vijaya sai reddy
vijaya sai reddy

వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ చేస్తూ వైఎస్సార్సీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిలు పార్లమెంటు ముందు ధర్నాకు దిగారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని గాంధీ విగ్రహం ముందు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని, ఆయన పేరు గిన్నిస్‌బుక్‌లో రికార్డు చేయాలంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు నాలుగున్నర సంవత్సరాలలో అధికారంలో ఉండి రూ.లక్షల కోట్లు అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. ఏపికి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీ నాలుగున్నర సంవత్సరాలుగా పోరాడుతుందన్నారు. వైఎస్‌ జగన్‌తోనే అది సాధ్యమవుతుందన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 25 ఎంపి సీట్లు గెలిపిస్తేనే ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌పై హత్యాయత్నం కేసులో కుట్ర దాగుందన్నారు. అందుకే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారన్నారు. ఎన్‌ఐఏకు సహకరించవద్దని చంద్రబాబు పోలీసులకు డైరక్షన్‌ ఇస్తున్నారని ఆరోపించారు.
చంద్రబాబ నాయుడు ఢిల్లీకి వచ్చినంత మాత్రనా ఏపికి ఒరిగింది ఏమీలేదని, దేశ రాజకీయాల్లో ఏ పార్టీ కూడా ఆయనను నమ్మదన్నారు. పోలవరం ప్రాజెక్టులో జరుగుతున్న పనులన్ని నాసిరకమైనవని, ప్రాజెక్టు అంచనాలను రూ.16వేల కోట్ల నుంచి రూ.50వేల కోట్లకు పెంచినందుకు గిన్నిస్‌బుక్‌ రికార్డుచేయాలన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయనందుకు కూడా ఆయన పేరును రికార్డు చేయాలన్నారు.