విప‌త్తుల స‌మ‌యంలో సాయం చేయ‌నున్న ఫేస్‌బుక్

FACEBOOK
FACEBOOK

ఢిల్లీః ప్రకృతి విపత్తుల సమయంలో బాధితులకు సత్వర సాయం అందించేందుకు ఫేస్‌బుక్‌ ముందుకొచ్చింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ), సీడ్స్‌ అనే స్వచ్ఛంద సంస్థతో చేతులు కలిపింది. విపత్తు సంభవించిన చోట ప్రజల కదలికలు, ఫేస్‌బుక్‌ వినియోగదారుల శ్రద్ధాసక్తులు (కాన్సంట్రేషన్‌) ఎలా ఉన్నాయో చూపించే ‘డిజాస్టర్‌ మ్యాప్స్‌ డేటా’ను ఆ సంస్థలకు అందించనుంది. భారత్‌లో విపత్తులు సంభవించినప్పుడు బాధితులకు మరింత ప్రభావ వంతంగా సేవలు అందించేందుకు, సత్వరం స్పందించేందుకు సహాయపడడమే తమ చర్యల వెనకాల ఉన్న ఉద్దేశమని ఫేస్‌బుక్‌ ప్రోగ్రామ్స్‌ (భారత్‌, దక్షిణ, మధ్య ఆసియా) అధినేత రితేశ్‌ మెహతా తెలిపారు.‘విపత్తు సంభవించినప్పుడు, తర్వాత అక్కడి వారిని రక్షించేందుకు, సాయం చేసేందుకు సహాయ సంస్థలకు కచ్చితమైన, వాస్తవమైన సమాచారం అవసరం. సంప్రదాయ కమ్యూనికేషన్‌ కమ్యూనికేషన్‌ సాధనాలు తరచూ రాయిస్తుండటంతో బాధితులకు సాయం చేసేందుకు ఆలస్యం అవుతుంది. విపత్తు జరిగిన చోట ఫేస్‌బుక్‌ వినియోగదారుల హై కాన్సంట్రేషన్‌ అకస్మాత్తుగా ఆఫ్‌లైన్‌లోకి వెళ్లిపోయినా డేటా ఇన్‌సైట్‌ ద్వారా బాధితుల వద్దకు సత్వరమే చేరుకోవచ్చు’ అని మెహతా అన్నారు.