వినాయక్ తో బెల్లంకొండ !

Bellam konda Srinivas, VV Vinayak
Bellam konda Srinivas, VV Vinayak

డైరెక్టర్ వినాయక్ సాయి ధరమ్ తేజ్ తో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉండగానే ఇంకో మూవీని ఒప్పుకున్నాడు వినాయక్. ప్రముఖ నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ నిర్మాణంలో ఈ సినిమా ఉండబోతోంది.

‘అల్లుడు శ్రీను’ సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట. సాయి శ్రీనివాస్ ను హీరోగా పరిచయం చేసిన వినాయక్ మళ్ళీ అతనితోనే సినిమా చేయ్యబోతుండడం విశేషం.