విద్యుద్ఘాతంతో అగ్ని ప్రమాదం: నాగార్జున

 

Nag Fire
Nagarjuna

హైదరాబాద్‌: అన్నపూర్ణ స్టూడియోలో విదుద్ఘాతం వల్ల అగ్ని ప్రమాదం సంభవించిందని అక్కినేని నాగార్జున తెలిపారు. ఐదేళ్ల క్రితం మనం సినిమా కోసం సెట్‌ వేశామని, ప్రమాదవశాత్తు ఈ ఘటన చోటు చేసుకుంది. పక్కన వేరే సెట్స్‌  లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. నాగార్జున సుమారు 2కోట్ల రూపాయలతో మనం సినిమా సెట్‌  వేసినట్లు తెలిపారు. నాన్న అక్కినేని నాగేశ్వరరావుగారి జ్ఞాపకార్థం సెట్‌ను అలాగే ఉంచినట్లు నాగార్జున చెప్పారు. నాన్న చివరి రోజులు అక్కడే గడపడం వల్ల తమకు సెట్‌ ఎంతో అటాచ్‌మెంట్‌ ఉండేదన్నారు.