విద్యుత్ వినియోగంలో ‘ఏ1 కేట‌గిరి’ సాధించిన కాచిగూడ రైల్వేస్టేష‌న్

KACHIGUDAFF
KACHIGUDA RAILWAY STATION

హైదరాబాద్‌: న‌గ‌రంలోని కాచిగూడ రైల్వేస్టేష‌న్‌కు ఆరుదైన గుర్తింపు ల‌భించింది. దేశంలో విద్యుత్‌ శక్తిని అత్యంత సమర్థంగా వినియోగించుకుంటున్న తొలి రైల్వే స్టేషన్‌గా కాచిగూడ స్టేషన్‌ గుర్తింపు సాధించింది. ఈ మేరకు విద్యుత్‌ వినియోగంలో కాచిగూడ ‘ఏ1 కేటగిరి’ రైల్వేస్టేషన్‌గా నిలిచిందని దక్షిణ మధ్య రైల్వే శుక్రవారం వెల్లడించింది. హైదరాబాద్‌ డివిజన్‌లోని కాచిగూడ రైల్వేస్టేషన్లో 1,312 సంప్రదాయ లైట్ల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటుచేశారు. ఇక 370 సీలింగ్‌ ఫ్యాన్లను బ్రష్‌లెస్‌ డీసీ ఎలక్ట్రికల్‌ మోటార్‌ ఫ్యాన్స్‌గా మార్చారు. సాధారణ ఏసీల స్థానంలో 12 ఇన్వర్టర్‌ టైప్‌ ఏసీలను ఏర్పాటుచేసినట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. ఈ మార్పులతో సంవత్సరానికి 1.76లక్షల యూనిట్ల విద్యుత్‌ ఆదా అయిందని తెలిపింది. దీని వల్ల రూ. 14.08 లక్షల ఖర్చు తగ్గిందని వెల్లడించింది. కాచిగూడకు ఏ1 కేటగిరిగా గుర్తింపు రావడంతో డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ యాదవ్‌ అభినందించారు.