విద్యుత్ ఒప్పంద ఉద్యోగుల స‌మ్మె విర‌మ‌ణ‌

G. Jagadish reddy
G. Jagadish reddy

హైదరాబాద్: విద్యుత్ ఒప్పంద‌ ఉద్యోగులు సమ్మె విరమించారు. మంత్రి జగదీశ్ రెడ్డి విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని సీఎం హామీ ఇచ్చారని మంత్రి తెలిపారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా క్రమబద్ధీకరణపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. ఒప్పంద‌ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కారిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ‘‘ప్రభుత్వం మా డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇచ్చింది. కోర్టు తీర్పు త్వరగా వచ్చేలా చూస్తామని మంత్రి జగదీశ్ రెడ్డి హామీ ఇచ్చారు. సమ్మె విరమిస్తున్నాం. కార్మికులంతా విధుల్లో చేరాలి’’ అని కాంట్రాక్ ఉద్యోగులు చెప్పుకొచ్చారు.