విద్యుత్‌ ఉత్పత్తి అధికంగా సాధిస్తేనే ప్రగతి

Power Generation
Power Generation

విద్యుత్‌ ఉత్పత్తి అధికంగా సాధిస్తేనే ప్రగతి

దేశంలో నాణ్యత తక్కువగా ఉన్న బొగ్గు అధిక శాతం లభిస్తోంది. దీని నుండి ఆయిల్‌, గ్యాస్‌ని, గ్యాస్‌ నుండి విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయ వచ్చు.టన్ను బొగ్గునుండి ఒక గంటకి గ్యాసిఫికేషన్‌ విధానం ద్వారా 1500 క్యూబిక్‌విూటర్ల గ్యాస్‌ని ఉత్పత్తి చేయవచ్చు. ఈ గ్యాస్‌లో 28 శాతం కార్బన్‌ డై ఆక్సైడ్‌, 18 శాతం కార్బన్‌ మోనాక్సైడ్‌, 10 శాతం మీథేన్‌, 40 శాతం హైడ్రొజన్‌ వాయువ్ఞలు ఉంటాయి.

ఈ విధంగా అధిక మొత్తంలో హైడ్రొజన్‌ ఉత్పత్తి అవ్ఞతున్నందున ఈ గ్యాస్‌ పర్యావరణానికి అనుకూలంగా ఉంటుంది. అందుకే నేషనల్‌ హైడ్రొజన్‌ ఎనర్జీ రోడ్డుమ్యాప్‌, గోల్స్‌, టార్గెట్స్‌ 2020 నాటికి 10 లక్షల వాహనాలకు ఈ హైడ్రొజన్‌ గ్యాస్‌ని వినియోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.ఈ గ్యాస్‌లో హైడ్రొజన్‌,కార్బన్‌ మోనాక్సైడ్‌ వాయువ్ఞలు కలిసి ఉన్నందున ఈ తరహా గ్యాస్‌ని సింథసైజ్‌డ్‌ గ్యాస్‌గా పిలుస్తారు. ఈ గ్యాస్‌ని ఉక్కు, స్పాంజిఐరన్‌, ఎరువ్ఞలు, రసాయనాలు తదితర కంపెనీల్లో ప్రాసెస్‌ హీటింగ్‌ కోసం వినియో గిస్తుంటారు. మనదేశంలోని ఐఓసి, గెయిల్‌,న్టెర్లింగ్‌ ఎనర్జీ, భూషన్‌ స్టీల్‌, టాటా కంపెనీ రిలయన్స్‌ ఇండస్ట్రీ మొదలైనవి వీటి ఉత్ప త్తులపై శ్రద్ధ చూపుతున్నాయి.ఈ కంపెనీలన్నీ ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జర్మనీ లూర్జీ కంపెనీకి చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని ఆసక్తి చూపుతున్నాయి. ఈ కంపెనీ ప్రస్తుతం మన దేశంలో కోల్‌ టు లిక్విడ్‌ (సిటిఎస్‌)పేరుతో బొగ్గు నుండి ఆయిల్‌, గ్యాస్‌ని ఉత్పత్తి చేయడం ప్రారంభించింది. వాస్తవానికి ఈ కంపెనీ మనదేశంలో 1964 నుండే బొగ్గు నుండి గ్యాస్‌ను ఉత్పత్తి చేసే ప్రక్రియలో మనకు సహకరిస్తూ వస్తోంది.

ఒడిస్సాలోని తాల్చే రు ప్రాంతంలో తక్కువ నాణ్యతగల బొగ్గు అధికంగా లభిస్తుండడం తో ఈ బొగ్గు నుంచే గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తోంది. స్టీల్‌ ఆధారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌) ఉత్పత్తి చేసే స్టీల్‌కి 2009 లో పెద్దమొత్తంలో కోకింగ్‌ కోల్‌ని విదేశాల నుండి టన్నుకి సుమారు 1000 డాలర్లు చెల్లించి దిగుమతి చేసుకోవలసి వచ్చింది. దీనివల్ల అప్పటి నుంచిస్టీల్‌ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. 2010 నవంబర్‌లో స్టీల్‌ ఒక టన్ను28వేల నుండి 33వేలు ఉండగా 2011ఏప్రిల్‌లో 38వేల నుండి 44వేలకు ధర పెరిగింది. అదే విధంగా సిమెంట్‌ ఇదే కాలంలో బస్తా 130 నుండి 260 రూపాయలకు పెరిగింది. రానురానూ కోకింగ్‌ కోల్‌ (బూడిదశాతం అతి తక్కువగా ఉండి నాణ్యమైనది) అవసరం బాగా ఉంటుంది. 2020 నాటికి 50 మిలియన్‌ టన్నుల కోకింగ్‌ కోల్‌ అవసరమ వ్ఞతుంది. దీనిలో అధికశాతం విదేశాల నుండి దిగుమతి చేసుకోక తప్పదు. దీని ద్వారా అధిక వ్యయం కావడమేకాక కాలుష్యం కూడా పెరుగుతుంది. అందుకే ఈ సంస్థ బొగ్గు నుండి గ్యాస్‌ను ఉత్పత్తి చేసి ఆ గ్యాస్‌ ద్వారా స్టీల్‌ను ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది. మనదేశంలో లభిస్తోన్న బొగ్గులో బూడిద 35 నుంచి 45 శాతం ఉండడంతో విద్యుత్‌ ఉత్పత్తికి ఎక్కువ శాతం బొగ్గును వినియోగిస్తే వ్యయం తడిసి మోపెడవడమే కాకుండా కాలుష్యం కూడా పెరుగు తుంది.

అందుకే ప్రత్యామ్నాయంగా ఈ బొగ్గును గ్యాస్‌గా మార్చి దాని ద్వారా గ్యాస్‌లో విద్యుత్తును ఉత్పత్తి చేస్తే ఒకపక్క వ్యయా న్ని, మరోపక్క కాలుష్యాన్ని నియంత్రించవచ్చు. ఇవన్నీ ఆలోచించి దేశంలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ దగ్గర 2008లో ఈ తరహా విద్యుత్‌ ప్లాంట్‌ను నెలకొల్పారు. ఈ ప్లాంట్‌ లో బొగ్గు ద్వారా ఉత్పత్తిఅయిన గ్యాస్‌ను ఉపయోగించి టర్బయి న్‌తో విద్యుత్‌ను తయారు చేశాక ఇదే సందర్భంగా ఈ ప్రక్రియలో వృధాగా వెలువడే వేడి వాయువ్ఞలను కూడా ఆవిరిగా మార్చి మరో టర్బయిన్‌ ద్వారా వెంటనే విద్యుత్‌ను తయారుచేస్తారు. దీనివలన సాధారణ బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా ఒక టన్ను బొగ్గు నుండి 1250 యూనిట్లు ఉత్పత్తి అయితే ఈ విధానం ద్వారా 2000యూనిట్లు ఉత్పత్తి చేయవచ్చు.ఈవిధానాన్ని ఇంటెగ్రే టెడ్‌ గ్యాసిఫికేషన్‌ కంబైన్డ్‌ సైకిల్‌(ఐజిసిసి) అని వ్యవహరిస్తున్నా రు.

దీనికి శక్తిసామర్థ్యాలు, ఉత్పత్తి శాతం ఎక్కువ ఉంటుంది. బొగ్గు ద్వారా గ్యాస్‌ను ఉత్పత్తి చేశాక ఈ గ్యాస్‌ను వినియోగించి విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ప్రపంచంలో రెండు రకాల సాంకేతిక సామర్థ్య ప్రక్రియలు అందుబాటులోకి వచ్చాయి. ఒకటి ఫిక్సెడ్‌-బెడ్‌ టెక్నాలజీ, రెండు ఫ్లూయిడైసెడ్‌-బెడ్‌ టెక్నాలజీ. మనదేశంలో లభించే బొగ్గుకి ఫ్లూయిడైసెడ్‌-బెడ్‌ టెక్నాలజీయే సరిపోతుంది. బిహెచ్‌ఇఎల్‌ సంస్థ ఈ విధానాన్ని అభివృద్ధి చేసింది. ఈ విధా నంలో బొగ్గుతో 55 శాతం బూడిద ఉన్నప్పటికీ గ్యాస్‌ని ఉత్పత్తి చేసి దాని ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగలం. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఐజిసిసి విద్యుత్‌ ఉత్పత్తి ప్లాంట్లలో అధికంగా వినియోగిస్తున్న ఎంట్రయిన్డ్‌ ఫ్లో గాసిఫియర్స్‌ టెక్నాలజీ కన్నా మెరుగ్గా ఫ్లూయిడైసెడ్‌ బెడ్‌ గాసిఫైడ్‌ విధానాన్ని అభివృద్ధిపరిచింది. ఈ విధానాన్ని అమెరికాతోపాటు అనేక దేశాలు కొనియాడాయి. మనదేశంలో అత్యధికంగా జార్ఖండ్‌ రాష్ట్రంలో బొగ్గు గనులున్నా యి. అతిపెద్ద బొగ్గుగని ఇదే రాష్ట్రంలోని ఝరియా ప్రాంతంలో ఉంది. ఇక్కడ లభించే బొగ్గు అత్యంత నాణ్యత కలిగిన కోకింగ్‌ కోల్‌ రకానికి చెందినది.ఇంతగా అభివృద్ధికి తోడ్పడుతున్న విద్యుత్‌ను ఇంధన వనరుల కొరత కారణంగా సమృద్ధిగా సమకూర్చు కోలేకపోతున్నాం. ఫలితంగా ఏటా లక్షల కోట్ల రూపాయల నష్టం మనకు వాటిల్లుతోంది. 2005-06లో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం 3000 బిలియన్‌ (రూపాయలు మూడు లక్షల కోట్లు) ఆదాయాన్ని కోల్పోయినట్టు ఆవేదన వెలిబుచ్చారు. దీనికి కారణం ఎనర్జీ సెక్టార్‌ (విద్యుత్‌, బొగ్గు, గ్యాస్‌, ఆయిల్‌) విఫలం కావడమే నని వివరించారు. 2006 నుంచి విద్యుత్‌ డిమాండ్‌కు తగినంత సరఫరా కాక విద్యుత్‌ రంగంలో తీవ్ర కొరత వెంటాడుతోంది.ఈ పరిస్థితుల్లో మనకు మనం సామర్థ్యం పెంచుకునే ఉత్పత్తి రంగాన్ని అభివృద్ధిపరచాల్సి ఉంది.

అలాగే విదేశీ ప్రత్యక్షపెట్టుబడులను కూడా విశేషంగా రాబట్టుకోవలసి ఉంటుంది.
2006 నుంచి చైనా ఏటా 100 బిలియన్‌ డాలర్లు పైగా పొందుతుండగా మనదేశం 2008లో 34 బిలియన్‌ డాలర్లను మాత్రమే పెట్టుబడిగా రాబట్టు కోగలిగింది. 2008 సెప్టెంబర్‌ నాటికి చైనా 1905 బిలియన్‌ డాలర్ల వరకు విదేశీ పెట్టుబడులను ఆర్జించగా జపాన్‌ 973 బిలియన్‌ డాలర్లు, దక్షిణ కొరియా 291 బిలియన్‌ డాలర్లు, భారత్‌ 239 బిలియన్‌ డాలర్లు మాత్రమే పొందగలిగాయి. చైనా ఎంతో ముందు చూపుతో విద్యుత్‌ను సమృద్ధిగా సమకూర్చుకుంటూ విదేశీ పెట్టుబడులకు విశేషంగా రాబట్టుకోవడం వల్లనే పారిశ్రామికంగా ముందంజవేస్తోంది. ప్రపంచ ఎగుమతుల్లో చైనా వాటా 10 శాతం ఉండగా మనదేశం వాటా కేవలం 1.45 శాతం మాత్రమే ఉండ డం గమనార్హం. దీనికి కారణం మనదేశంలో ఉన్న సహజసంపదని పూర్తిస్థాయిలో మనం వినియోగించుకోలేకపోవడమే.

ఇతర దేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పేదరికం తగ్గుతోంది. అదే మనదేశంలో ఎగుమతుల కంటే దిగుమతులే ఎక్కువగా ఉంటున్నాయి. 2008-09లో మనదేశం 185.3 బిలియన్‌ డాలర్ల విలువగల వస్తువ్ఞలను విదేశాలకు ఎగుమతి చేస్తే దిగుమతుల విషయానికి వచ్చే సరికి 303.7 బిలియన్‌ డాలర్లు ఉండడంతో మనవాణిజ్య లోటు 118.4 బిలియన్‌ డాలర్లకు చేరడం శోచనీయం. విదేశాలన్నీ సమృద్ధిగా విద్యుత్‌ ఉత్పత్తిని చేసుకోవడం వల్లనే వివిధ రకాల వస్తువ్ఞలను ఉత్పత్తి చేసి విదేశాలకు భారీ మొత్తంలో ఎగుమతులు చేసి ఆర్థికంగా బలపడుతున్నాయి. ముఖ్యంగా విదేశాలు అణువిద్యు త్‌కి ప్రాధాన్యం ఇస్తున్నాయి. బొగ్గు, గ్యాస్‌ ఇతర సంప్రదాయేతర ఇంధన వనరులకు కూడా కొద్దిగా ప్రాధాన్యం ఇస్తున్నాయి. 2020 నాటికి మొదటి ప్రపంచ దేశంగా గుర్తింపు పొందడానికి చైనా ప్రయత్నిస్తుండగా మనదేశం ఇంకా మూడో ప్రపంచదేశంగా కొన సాగుతూ 2032 నాటికి మొదటి ప్రపంచదేశంగా గుర్తింపుపొందా లన్న లక్ష్యంతో ప్రయత్నిస్తోంది.

-కె. యాదగిరి రెడ్డి