విద్యుత్‌పంపిణీ సంస్థలకు తప్పని ఆర్థిక లోటు

Power Generation
Power Generation

విద్యుత్‌పంపిణీ సంస్థలకు తప్పని ఆర్థిక లోటు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యుత్‌ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్‌లో ఇంధనశాఖకు రూ.5650 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో వ్యవసాయరంగానికి 24గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్న నేపథ్యంలో పీక్‌ డిమాండ్‌ పదివేల మెగావాట్లకు పెరిగినా తట్టుకునే విద్యుత్‌ సరఫరా, పంపణీ వ్యవస్థలను పటిష్టం చేసింది.

వేసవిలో పెరిగే విద్యుత్‌ వినియోగదాపు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే పీక్‌ డిమాండ్‌ను తట్టుకునేలా విద్యుత్‌ పంపిణీ సామర్థ్యాన్ని 15344 మెగావాట్‌లకు పెంచుకునేందుకు సన్నద్దమైంది. ప్రస్తుతం వ్యవస్థాపక సామర్థ్యం 11,689మెగావాట్లు ఉండగా మిగతా విద్యుత్‌ కొనుగోళ్లు చేపడుతోంది. సోలార్‌ పవర్‌ను 3283మెగావాట్‌లకు పెంచుకుని దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. రానున్న రోజుల్ల 28275మెగావాట్‌ల వ్యవస్థాపక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునేలా ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఈ మాసాంతానికి కెటిపిఎస్‌ ద్వారా 800 మెగావాట్‌లు, అదే విధంగా ఈ ఏడాది మాసాంతానికి 1080 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ ను త్వరిత గతిన పూర్తి చేసేందుకు రాష్ట్ర బడ్జెట్‌లో ప్రాధాన్యత కల్పించింది.

అదే విధంగా మరో 4000మెగావాట్ల సామర్థ్యంతో ఉమ్మడి నల్గొండజిల్లాలోని దామరచర్లలో యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ను చేపడుతోంది.విద్యుత్‌ కనెక్షన్ల సంఖ్యను ఒకకోటి 37లక్షల 22వేల 831కు పెంచుకుంది గడిచిన నాలుగేళ్లలో 3లక్షలకు పైగా విద్యుత్‌ కనెక్షన్‌లను కల్పించి వినియోగదారులను పెంచుకుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 23లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల ఉచిత విద్యుత్‌ అందిస్తోంది. అయితే 24గంటల విద్యుత్‌ సరఫరా చేస్తున్న నేపథ్యంలో డిస్కంలు భారీగా విద్యుత్‌ కొనుగోళ్లు చేప్టాయి. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనా టికి డిస్కంలు రూ.9870.98కోట్లు లోటు ఉంటుం దని అంచనా వేస్తున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.5650కోట్లు మాత్రమే కేటాయించిది.

ఈ ఆర్థిక సంవత్సరానికి విద్యుత్‌ చార్జీలు పెంచకూడ దని నిర్ణయించిన నేపథ్యంలో అదనపు ఆదాయం లేక పోవడంతో డిస్కంలు లోటు ఏర్పడే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం గత2016-17 ఆర్థిక సంవత్స రంలో దాదాపు 15వేల కోట్లు రూపాయలు ఆర్థిక సహాయంఅందించింది. ఫలితంగా డిస్కంలకు ఎలాంటి ఆర్థిక సమస్యలేదని దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ ఇప్పటికే వెల్లడించింది. ఉద§్‌ు పథకంలో చేరడం ద్వారా గతసెప్టెంబరు 2015వరకు డిస్కంలకు ఉన్న అప్పుల్లో 75శాతం అంటే రూ.8900కోట్లు రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్‌ చేసింది.