విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది

KORATALA SIVA
KORATALA SIVA

గతంలోనూ రాజకీయ వ్యవస్థ – అవినీతిపై చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిన కొరటాల… ఇప్పుడు విద్యా వ్యవస్థపై మాత్రం ఆసక్తికరంగా – జనాలను ఆలోచనలో పడేసే విధంగా కామెంట్ చేశారు. ట్విట్టర్ వేదికగా కొరటాల చేసిన కామెంట్ ఏంటనే విషయానికి వస్తే… మన విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు రావాల్సిన అవసరం ఉంది. హాయిగా ఆనందిస్తూ.. చదువుకునే రోజులని మళ్లీ తీసుకురావాలి* అంటూ కొరటాల ట్వీట్ చేశారు. చూసేందుకు ఇది చాలా చిన్న ట్వీట్ లా అనిపించినా ఆయన చెప్పింది మాత్రం అక్షరసత్యమని చెప్పక తప్పదు.కొరటాల శివ చెప్పినట్లుగా చదువును ఆనందంగా ఇష్టపడి చదివే రోజులు వస్తే మాత్రం అంతకంటే ఇంకేం కావాలి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.