విద్యార్థులకు హెచ్‌పి బంపర్‌ ఆఫర్‌

HP
హైదరాబాద్‌ : విద్యాసంవత్సరం ప్రారంబం కావడంతో విద్యార్థులకోసం హెచ్‌పి కంపెనీ బ్యాక్‌టు కాలేజ్‌ ప్రచారం ప్రారంభించింది. విద్యార్ధులకు ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. హెచ్‌పి ఆల్‌ఇన్‌వన్స్‌, హెచ్‌పి డెస్క్‌ టాప్స్‌ వంటి కొన్నింటిని ఎంపికచేసిన ఉత్పత్తులపై విద్యా ర్థులు 11,998 వరకూ లబ్ధిపొందే విధంగా బ్యాక్‌టు కాలేజ్‌ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. హెచ్‌పిలాప్‌టాప్‌ 5999 రూపాయలు, డెస్క్‌టాప్‌కు రూ.3500లు ఇతర ఉపకరాణాలైన హెడ్‌ఫోన్లు, హార్డ్‌ డ్రైవ్స్‌, బ్లూటూత్‌ స్పీకర్లకు మూడేళ్లపాటు నామమాత్రపు ధరతో అదనంగా ఆన్‌సైట్‌ వారంటీ సదుపాయం ఇస్తున్నట్లుహెచ్‌పి భారత్‌ కంట్రీమేనేజర్‌ అనురాగ్‌ అరోరా వివరించారు. హెచ్‌పి పెవిలియన్‌, హెచ్‌పి పెవిలియన్‌ నోట్‌బుక్స్‌, హెచ్‌పి ఆల్‌ ఇన్‌వన్స్‌ను అందిస్తోంది. ఆల్‌ఇన్‌వన్స్‌ 23,290 ప్రారంభ ధరతో లభిస్తాయి. హెచ్‌పి స్లిమ్‌లైన్‌ డెస్క్‌టాప్‌ 22,490 ధరలతో లభిస్తాయన్నారు. ఈ ఏడాది ఉన్నత విద్యా సంస్థలు, సాఫ్ట్‌వేర్‌ సంస్థల పరంగాను, ఇంజినీరింగ్‌ కళాశాలల పరంగా తమ ఉత్పత్తులు మరింత పెరుగుతాయని ఇతర వివరాలకు హెచ్‌పి షాపింగ్‌ డాట్‌ఇన్‌/బిటిసి2016ను క్లిక్‌ చేయడం ద్వారా పొందవచ్చన్నారు.