విద్యార్థి విభాగానికి ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తాంః సీఎం కేసీఆర్

KCR
KCR

హైదరాబాద్: టీఆర్ఎస్వీ నాయకులతో సీఎం కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌లో ఏర్పాటు చేసిన సమావేశం కొద్దిసేప‌టి క్రితం ముగిసింది. ఈ సమావేశంలో పార్టీ బలోపేతం దిశ‌గా విద్యార్థి నాయకులకు సీఎం పలు సూచనలు చేశారు. వచ్చేవారంలో రాష్ట్ర, జిల్లా కో ఆర్డినేటర్లకు శిక్షణా తరగతులు ఉంటాయని తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టులను సందర్శించాలని విద్యార్థి నాయకులకు సీఎం సూచించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, బాల్కసుమన్ ఆధ్వర్యంలో విద్యార్థుల కార్యక్రమాలు కొనసాగించాలన్నారు. మిషన్ భగీరథ, సాగునీటి ప్రాజెక్ట్‌లపై ప్రజలకు వివరించాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ స్థానాలు పెరిగితే విద్యార్థి విభాగానికి 3 నుచి 5 సీట్లు కేటాయిస్తామని, అదేవిధంగా ఓ ఎమ్మెల్సీ స్థానం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.