విదేశీ విద్య నిధి ద‌ర‌ఖాస్తు గ‌డువు పెంపు

CAREER
CAREER

హైద‌రాబాద్ః బీసీ విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఉద్దేశించిన విదేశీ విద్య నిధి దరఖాస్తు గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న శుక్రవారం తెలిపారు. ఈ అవకాశాన్ని బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు గడువు జనవరి 31న ముగిసినా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పొడిగించామని మంత్రి తెలిపారు. వివరాల కోసం జిల్లా, డివిజన్‌ బీసీ సంక్షేమ అభివృద్ధి అధికారులను సంప్రదించాలన్నారు. బీసీ అభ్యర్థులు ఈ-పాస్‌ వెబ్‌సైట్‌లో htpp//telanganaepass.cgg.gov.in దరఖాస్తు చేసుకోవాలన్నారు.