విదేశాల్లో భారతీయ విద్యాసంస్థ భవితకు బాసట ‘నిధిమ్‌’

career
Indian Studies in Foreign Countries

విదేశాల్లో భారతీయ విద్యాసంస్థ భవితకు బాసట ‘నిధిమ్‌’

డిగ్రీ చదివితే ఉద్యోగం అనేది ఒకనాటి మాట. ఇంజనీరింగ్‌ చేస్తేనే ఉద్యోగాలనేది నిన్నటి మాట. మేనేజిమెంట్‌ కోర్సులొక్కటే, నేటితరం యువతరానికి, ఉజ్వల భవిష్యత్తునిస్తుందనేది ఈనాటి మాట. మంచి ఉద్యోగావకాశాలను కల్పించి, ఉజ్వల భవిష్యత్‌ను అందిస్తున్న భారత జాతీయ సంస్థే హైదరాబాద్‌ లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటి మేనేజ్‌మెంట్‌. ఏదైనా కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం వస్తుందనేది మనమెరిగిన నిజం, కాని కోర్సు చేస్తూనే వేతనాలను అందుకోవటమనేది నిధిమ్‌ (నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటి మేనేజ్‌మెంట్‌) విద్యార్థుల సొంతం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంస్థ.

వేగంగా అభివద్ధి చెందుతున్న టూరిజం, హాస్పిటాలిటి రంగాలలో ప్రపంచ స్థాయి ప్రమాణాలు గల నిపుణులను తీర్చిదిద్దేందుకు, తద్వారా వారికి పలు దేశాలలో ఉపాధి ఉద్యోగావకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏర్పాటుచేసి, మంచి ఫలితాలను అందిస్తున్న ఏకైక సంస్థే నిధిమ్‌. మనదేశంలో 2004 వరకు టూరిజం, ట్రావెల్‌ అండ్‌ హాస్పిటాలిటి మేనేజ్‌మెంట్‌లలో జాతీయ స్థాయి శిక్షణా సంస్థలు లేవు. ప్రపంచవ్యాప్తంగా 11శాతం వద్ధి రేటుతో శరవేగంగా అభివద్ది చెందుతున్న టూరిజం అండ్‌ హాస్పిటాలిటి రంగాలకు అంతర్జాతీయ ప్రమాణాలు గల ఒక జాతీయస్థాయి శిక్షణా సంస్థ అవసరమని భారత ప్రభుత్వం భావించింది. అందుకు అవసరమైన మౌళిక సదుపాయాలను కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందుకు రావటంతో వెంటనే హైదరాబాద్‌లో ప్రారంభానికి సన్నాహాలు చేయటం, 2005లో సోనియాగాంధీ ప్రారంభించటం శరవేగంగా జరిగిపోయాయి. మారుతున్న పరిస్థితులు, పర్యాటక రంగంలోని మార్పులకు అనుగుణంగా కొత్త కోర్సులను ఎప్పటికప్పుడు నిధిమ్‌ తీర్చిదిద్దుతుంది. నిధిమ్‌ కోర్సులు:- నిధిమ్‌ ప్రారంభించి మూడు సంవత్సరాలు అయినప్పటికీ టూరిజం, హాస్పిటాలిటి, ట్రావెల్‌ ఇండస్ట్రీలలో మేనేజ్‌మెంట్‌ కోర్సులను నిర్వహిస్తూ, తన విద్యార్థులకు నూరుశాతం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పి స్తోంది. ఇందులో ప్రస్తుతం ఎం.బి.ఎ( ఇన్‌ టూరిజిం అండ్‌ హాస్పిటాలిటి మేనేజ్‌మెంట్‌), పిజి డిప్లొమో ఇన్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌(9 నెలల కోర్సు) డిప్లొమో ఇన్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (6 నెలల కోర్సు) ప్రస్తుతం నిధిమ్‌ ఆధ్వర్యంలో ప్రపంచ టూరిస్టుల అభిరుచులు, టూరిజం రంగంలో చోటుచేసుకుంటున్న విప్లవాత్మక మార్పులను దష్టిలో ఉంచుకొని ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఇక్కడి విద్యార్థినులను తీర్చిదిద్దుతుంది. నిధిమ్‌లో ముఖ్యంగా టూరిజం, ట్రావెల్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కల్చరల్‌ హెరిటేజ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, ఫారెన్‌ లాంగ్వేజెస్‌, జనరల్‌ మేనేజిమెంట్‌, ఫైనాన్షియల్‌, హెచ్‌.ఆర్‌, ఎంటర్‌ పిన్యూర్‌షిప్‌ లాంటి అంశాలలో మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌లో విద్యార్థులకు తర్ఫీదునిస్తుంది.

కొత్త కోర్సులు:

పైన పేర్కొన్న కోర్సులతో పాటు 2008 సెప్టెంబరు నుండి ఫెసిలిటీస్‌ మేనేజ్‌మెంట్‌, ఫుడ్‌బెవరేజ్‌, ట్రావెల్‌ అండ్‌ టూరిజం, ఎయిర్‌పోర్టు మేనేజ్‌మెంట్‌, స్పోర్ట్స్‌ అండ్‌ లీజర్‌, మాల్‌ మేనేజ్‌ మెంట్‌, రిసార్ట్‌ మేనేజిమెంట్‌లలో డిప్లొమో కోర్సులను ప్రారం భించనున్నారు. అడ్మిషన్‌ పొందే విధానం:- జాతీయ స్థాయిలో జరిగే ఏ మేనేజిమెంట్‌ టెస్ట్‌లో అర్హత సాధించిన వారైనా ఇక్కడి ఎం.బి.ఎ ప్రోగ్రాం చేసేందుకు అర్హులు. కీట్‌, ఎక్స్‌సెట్‌, మ్యాట్‌, ఆత్మో, ఐసెట్‌ లాంటి ఏ అర్హత పరీక్షలో పాసైన వారైనా అర్హులు. ఆపై వారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలు ద్వారా ఎంపిక జరుగుతుంది. ఏ గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారైనా ఎం.బి.ఎ చేరేందుకు అర్హులు. పిజి డిప్లొమో కోర్సులు చేరేందుకు కూడా గ్రాడ్యుయేషన్‌ ఏ సబ్జక్టులోనైనా పూర్తి చేసి ఉండాలి. వారికి గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక జరుగుతుంది. డిప్లొమో కోర్సులకు మాత్రం ఇంటర్మీడియెట్‌ పాసై ఉండాలి. కోర్సులు ఎలా ఉంటాయి: ఎం.బి.ఎ కోర్సు రెండు సంవత్సరాల కాలంలో నాలుగు సెమిష్టర్లు ఉంటాయి. మూడు సెమిష్టర్స్‌ థియరీ క్లాసులు ఉంటాయి. నాల్గవ సెమిష్టర్లో స్టైఫండరీ ప్లేస్‌మెంట్‌కు అందరు ఎంపికవుతారు.

వివిధ ఎయిర్‌లైన్స్‌, టూరిజం శాఖలు, హోటల్స్‌లో వీరి స్టైఫండరీ ప్లేస్‌మెంట్‌ ఆరు నెలల కాలం ఉంటుంది. ఈ ఆరునెలల కాలంలో నెలకు సుమారు 10 వేల రూపాయల వేతనం ఉంటుంది. అది పూర్తిచేశాక ఎం.బి.ఎ డిగ్రీ వస్తుంది. ఆపై వారు స్టైఫండరీ ప్లేస్‌మెంట్‌ చేసిన చోటయినా మరెక్కడైనా 20 నుండి 35 వేల వరకు వేతనం పొందే ఉద్యోగాలలో చేరిపోతారు. పిజి డిప్లొమో కోర్సులలో ఆరునెలలు థియరీ, మూడునెలలు స్టైఫండరీ ప్లేస్‌మెంట్‌ ఉంటాయి. ట్రైనింగ్‌ కోర్సులో భాగమే అయినా కోర్సు చేస్తూనే వేతనాలు పొందటం నిధిమ్‌ విద్యార్థుల ప్రత్యేకత. బోధనా సౌకర్యాలు: నిధిమ్‌లో ప్రతి సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 9.30 గంటల నుండి సాయంత్రం 4.30 వరకు క్లాసులు జరుగుతాయి. శనివారం 8 మంది విద్యార్థులను ఒక్కో బ్యాచ్‌గా చేసి ఒక్కో ఫ్యాకల్టీ ద్వారా వివిధ ప్రదేశాలను సందర్శించి, వాటిపై ప్రజంటేషన్స్‌ ఇస్తారు. ఆయా టూరిస్టు ప్రదేశాలు, ప్రాంతాలపై రిపోర్టు తయారుచేస్తారు. మొత్తం శిక్షణలో 40 శాతం అనేక రకాల పారిశ్రామిక సంస్థల నుండి వచ్చిన నిపుణులతోను, 20 శాతం స్థానికంగా హైదరాబాద్‌లో ఉండే వివిధ విశ్వవిద్యా లయాల నిపుణులతోను, 40శాతం శిక్షణ బోధనలు నిధిమ్‌ అధ్యాపకులతోను జరుగుతాయి. ప్రతి సోమ వారం లైబ్రరీ సెషన్‌, ప్రజంటేషన్స్‌ ఉంటాయి. క్యాంపస్‌లోనే ఒక ఫోర్‌స్టార్‌ హోటల్‌ ఉంటుంది. దీనినే హాస్పి టాలిటి లేబరేటరీ అంటారు. కోర్సు కాలంలో ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ అంతా ఇందులో జరుగుతుంది. క్యాంపస్‌ సౌకర్యాలు: విద్యార్థులందరికి అధునాతనసౌకర్యాలు గల లైబ్రరీ అందుబాటులో ఉంటుంది. ప్రపం చంలోని టూరిజం, ట్రావెల్స్‌, హాస్పిటాలిటీకి సంబంధించిన జర్నల్స్‌ను ఇక్కడే ఆన్‌లైన్‌ ద్వారా చూసుకునే అవ కాశం ఉంది. ట్రావెల్‌, టూరిజం, హాస్పిటాలిటీలకు సంబంధించిన అనేక అంశాలపై సిడిలను లైబ్రరీలో అందు బాటులో ఉంచుతారు. పూర్తిస్థాయి ఇంటర్‌నెట్‌ ల్యాబ్‌ విద్యార్థులకు నిత్యం అందుబాటులో ఉంది. విద్యార్థులకు, విద్యార్థినులకు వేరువేరుగా హాస్టల్స్‌ ఉన్నాయి.

హాస్టల్స్‌లో సింగిల్‌ రూమ్స్‌, డబుల్‌రూమ్స్‌, డార్మిటరిలు విద్యా ర్థులకు అందుబాటులో ఉంటాయి. రూముకు నెలకురూ.1000నుండిరూ.1500 మధ్య వసూలు చేస్తారు. సమతుల్యఆహారం అందుబాటులో ఉంటుంది. భోజనానికి ఒక్కో విద్యార్థి నుంచినెలకురూ.3000 వసూలుచేస్తారు.