విడుదలకు సిద్ధంగా ‘మరకతమణి’!

A Still from MARAKATA MANI
A Still from MARAKATA MANI

విడుదలకు సిద్ధంగా ‘మరకతమణి’!

ఆది పినిశెట్టి, నిక్కి గర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌ బ్యానర్స్‌పై శరవణన్‌ దర్శకత్వంలో రిషి మీడియా, శ్రీ చక్ర ఇన్నోవేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మరకతమణి. దిబు నైనన్‌ థామస్‌ సంగీతం అందించిన ఆడియోని ఇటీవలే నాని, అల్లరి నరేష్‌ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ ఎడ్వంచరస్‌ థ్రిల్లర్‌ ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి జూన్‌ 16 న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ సందర్బంగా.. దర్శకుడు ఎఆర్‌కె.శరవణన్‌ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ యూనివర్సల్‌ పాయింట్‌తో రూపొందింది కాబట్టి ఈ సినిమాను తెలుగులో కూడా చేశాము.

నన్ను హీరో ఆదిగారు ముందు నుండే ఎంకరేజ్‌ చేశారు. అందుకు తగిన విధంగా సపోర్ట్‌ అందించారు. ఈ చిత్రం జూన్‌ 16న విడుదల చేస్తున్నాము అన్నారు. దిబు నినన్‌ థామస్‌ మాట్లాడుతూ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌గా నా తొలి తెలుగు సినిమా ని చాలా బాగా ఆదరించారు చాలా ఆనందంగా వుంది. మా సినిమాలో ఐదు పాటలుంటాయి. ప్రతి పాట డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ చిత్రం ఆడియోలానే సినిమా కూడా పెద్ద హిట్‌ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ.. పూర్తిగా ఈ సినిమా wస్కిప్ట్‌ బేస్‌డ్‌ మూవీ. ఓ ఐదుగురి క్యారెక్టర్స్‌ను బేస్‌ చేసుకుని రన్‌ అవుతుంటుంది. wస్కిప్టే సినిమాలో హీరో. ఇప్పటి వరకు నేను సీరియస్‌ పాత్రలే చేశాను. నేను నటించిన తొలి కామెడి సినిమా అని చెప్పొచ్చు. డైరెక్టర్‌ శరవణన్‌ ఆలోచనతో చేసిన ఈ కథ డిఫరెంట్‌గా ఉంటుంది. దిబు థామస్‌గారు తన ట్యూన్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌తో సినిమాకు ప్రాణం పోశారు. అలానే కొటా శ్రీనివాసరావుగారు, బ్రహ్మనందం గారు కూడా నటించారు. చివరి వరకూ ఓ సస్పెన్స్‌ రన్‌ అవుతూ వుంటుంది. చూసిన ప్రతిఒక్కరూ థ్రిల్‌ ఫీలవుతారనేది వాస్తవం, జూన్‌ 16న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుంది అన్నారు.