విడుదలకు ముందే సంచలనం

SINGAM3
SINGAM3

విడుదలకు ముందే సంచలనం 

సూర్య , శ్రుతిహసన్‌, అనుష్కలు జంటగా నటిస్తున్న చిత్రం ళీ3-యముడు-3 . తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఫిబ్రవరి 9 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి హరి దర్శకుడు. గతంలో యముడు, సింగం చిత్రాలను మించి ప్రీరిలీజ్‌ కే 100 కొట్ల బిజినెస్‌ చేసి సంచలనం సృష్టించింది. ఈ చిత్రం స్టూడియో గ్రీన్‌ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా సగర్వంగా సమర్పిస్తూ తెలుగులో సురక్ష్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత మల్కాపురం శివకుమార్‌ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ.. తమిళ, తెలుగు బాషల్లో పవర్‌ ఫుల్‌ పోలీస్‌ పాత్రలతో వరుస విజయాలు సాధిస్తున్న సూర్య, హరి కాంబినేషన్‌లో రూపొందుతున్న మూడవ చిత్రమిది. యముడు, సింగం చిత్రాలు ఘనవిజయాల్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న ఈ సినిమా ఇప్పటికే 100 కోట్ల బిజినెస్‌ చేసి రికార్డు సాదించింది. ఈ చిత్రంలో చాలా మాస్‌ ఆడియన్స్‌ కి నచ్చే ఎలిమెంట్స్‌ వున్నాయి. తెలుగు ప్రేక్షకుల్లో హరి wస్కీన్‌ప్లే కి కూడా ఫ్యాన్స్‌ వుండటం విశేషం. సూర్య గారు పవర్‌ఫుల్‌ పోలీస్‌ గా యాక్షన్‌ తో మరొక్కసారి విజృంభించారు. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఫిబ్రవరి 9న మా బ్యానర్‌ ద్వారా తెలుగు వెర్షన్‌ ని విడుదల చేస్తున్నాం అన్నారు.