విడిగా ఉంటూనే ప్రేమను పంచుకోవచ్చు

bea lady
bea lady

నా భర్త దేవ్ఞనిలా పెళ్లి చేసుకున్నారు. మా అత్త దెయ్యంలా పీడిస్తోంది. నా కుటుంబ నేపధ్యం పేదరికం శాపంగా పరిణమిస్తున్నది. నా భర్తకుప్రేమ కావాలి, అత్తకు ఆస్తికావాలి. నా భర్త తన తల్లిని అదుపు చేయలేరు, నన్ను ఆదుకోలేరు. గర్భవతిగా ఉన్నప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చేస్తే చావనివ్వలేదు. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తరువాత సుఖంగా బతకనివ్వడం లేదు. భర్తతో కలసివ్ఞంటే నరకం, అతన్ని వదిలి వెళ్లాలంటే భయం. చావాలంటే వీలుకాక, బతకాలంటే భద్రతలేక సతమతమవ్ఞతున్నాను. నా వయసు 25 ఏళ్లు. ఇంటర్‌ వరకు చదివాను. మాది పేదక కుటుంబం. నాన్న తాగుబోతు, మా అమ్మే కూలీ నాలీ చేసి నన్ను, తమ్ముని పెంచింది. ఆర్థిక పరిస్థితి బాగలేకపోవడంతో నేను ఇంటర్‌తోనే ఆపేశాను. తమ్ముడు డిగ్రీ చదువ్ఞతున్నాడు. నేనొక షాపులో పనిచేస్తూ అమ్మకు చేదోడుగా వ్ఞండే దాన్ని. రెండేళ్లక్రితం మా బంధువ్ఞల అబ్బాయి నన్ను చూసి ఇష్టపడ్డారు. అతనికి ఊరిలో కొద్ది ఆస్తిపాస్తులు వ్ఞన్నాయి. వారిది మధ్య తరగతి కుటుంబం. అతను దగ్గరిలోని పట్టణంలో స్వంతంగా చిన్న షాపు పెట్టుకుని బతుకుతున్నారు. అతనే నాతో పెళ్లి ప్రస్తావన తెచ్చారు. ఆ విషయం మా అమ్మకు కూడా చెప్పాం. అయితే అమ్మ తన వద్ద డబ్బు లేదని పెళ్లి ఖర్చు కూడా పెట్టే స్ధితిలో లేనని తేల్చి చెప్పింది. దీంతో ఆ అబ్బాయి తాను సంపాదించి పొదుపు చేసిన డబ్బును మా అమ్మ చేతికి ఇచ్చి ఖర్చుపెట్టమన్నారు. అలాగే తన బంధువ్ఞల ద్వారా మరొక లక్ష ఇప్పించి నగలు చేయించుకోమన్నారు. ఇవన్నీ అతని తల్లికి తెలియకుండా రహ్యంగా ఉంచమన్నారు. మేం అలాగే వ్యవహరించాం. అయినా మా పరిస్థితి తెలిసినందున అతని తల్లి తొలుత ఇష్టపడలేదు. అతనే ఏవో చెప్పి తల్లిని ఒప్పించి నన్ను పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన తర్వాత మా అత్త నా పట్ల అయిష్టంగా ప్రవర్తిస్తూ వచ్చింది. అయితే మేం ఆమెకు దూరంగా పట్టణంలో వ్ఞన్నందున పెద్దగా ఇబ్బంది అనిపించలేదు. అయితే పట్టణంలో షాపు సరిగా జరగకపోవడంతో పెళ్లయిన ఆరునెలలకే కొట్టు మానేయాల్సి వచ్చింది. ఇక చేసేదిలేక ఊరిలో వ్ఞన్న పొలంలో వ్యవసాయం చేద్దామని నా భర్త ప్రతిపాదించారు. నేను అందుకు సమ్మతింతి ఊరికి వెళ్లాం. అప్పటికే నేను గర్భం దాల్చాను. అయినా మా అత్త నన్ను ప్రేమగా చూడలేకపోయింది. ప్రతిదానికి తిట్టడం, విమర్శించడం చేసేది. సూటిపోటీమాటలతో మా అమ్మ, నాన్నలను ఎత్తిపొడిచేది. కొద్దిరోజులకే పెళ్లి సమయంలో నా భర్త మాకు డబ్బు ఇచ్చిన విషయం మా అత్తకు తెలిసిపోయింది. దాంతో నాపై మరింత విరుచుకుపడటం ప్రారంభించింది. నేనేదైనా వివరించే ప్రయత్నం చేస్తే రెచ్చిపోయి కోడలంటే పనిమనిషితో సమానం, పెట్టింది తిని చెప్పింది చేయాలని అంటూ విూదకు వచ్చేది. ఓ రోజు ఆమె వేధింపులు తట్టుకోలేక పొలం కోసం తెచ్చిన పురుగుల మందు తాగేశాను. వాంతులు అవడంతో మా అత్త గమనించి ఆసుపత్రిలో చేర్పించి, బతికించింది. అలాగే వేదనలు భరిస్తూ ఏడోనెల రాగానే ప్రసవానికని మా పుట్టింటికి వచ్చేశాను. ఒక పాప పుట్టి మూడునెలలైన తర్వాత అత్తవారింటికి వెళ్లాను. వేధింపులు మరింత ఎక్కువ కావడంతో తిరిగి పుట్టింటికి వచ్చేశాను. ఇప్పుడు నా భర్త నన్ను తనతో రమ్మని బతిమాలుతున్నారు. అయినా నాకు ధైర్యం చాలడం లేదు. ఈ నేపధ్యంలో నా సమస్యకు సానుకూల పరిష్కారం చెప్పండి. – కె.సుకన్య, గుంటూరు
అమ్మా, విూ సమస్య అర్ధమయ్యింది. కోడలు అంటే పనిమనిషి కాదు. ఇంటికి దేవత ఇల్లాలు అంటారు. ఒక పురుషుని జీవితం సార్థకమవ్వాలన్నా, అతని వంశం వృద్ధి పొందాలన్నా భార్యే మూలం. మనం వ్యయసాయ క్షేత్రంలో నారు పోయాలన్నా, మొక్కలు నాటాలన్నా ముందు పూజ చేస్తాం. అలాగే పునాదులు వేసేటప్పుడు, గృహప్రవేశం చేసేటప్పుడు పూజలు చేయడం పరిపాటి. అలాంటిది వంశాన్ని వృద్ధి చేసే ఇల్లాలిని ఎంత పవిత్రంగా చూడాలి అన్న విషయం అత్తలు ఆలోచించాలి. అత్తా ఒకనాటి కోడలే కదా! అప్పట్లో ఆమె పడ్డ కష్టాలను గుర్తుకు తెచ్చుకుని సహానుభూతితో ఆలోచిస్తే అత్తల్లో మార్పు వస్తుంది. మన సమాజంలో చాలామంది అహంకార పూరితంగా వ్యవహరించడం అలవాటు చేసుకుంటారు. ఇతరుల విూద ఆధిపత్యం చలాయించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఉన్నత స్థాయి వ్యక్తులు తన కిందస్థాయివారిపై పెత్తనం చెలాయించాలనుకుంటారు. అలాగే అత్తలు కోడళ్లను తమ కనుసన్నల్లో కట్టుకోవాలని భావిస్తారు. కోడళ్లను కూతుళ్లుల్లా చూసే అత్తలు వ్ఞన్నారు. అయితే నాగరికత తెలియని వారు, మానవ ధర్మాలు అర్ధం కానివారు, కుటుంబ వ్యవస్థపై అవగాహన లేనివారు అహంకార పూరితులు కోడళ్లను అణచివేయాలని భావిస్తారు. ఇందుకు వారి వ్యక్తిత్వం, దృక్పధంలోని లోపాలేకారణం. ఇదిలా వ్ఞండగా తల్లి, భార్యల మధ్య తలెత్తే వివాదాలను పరిష్కరించగల నైపుణ్యం కొందరిలో వ్ఞండదు. తల్లి అంటే ఆరాధన, భార్య అంటే ప్రేమ ఉంటుంది. ఎవరికి ఏది చెప్పాలో తెలియక సతమతమవ్ఞతుంటారు. ఇది మన సమాజంలోని పలు కుటుంబాలలో కనిపిస్తుంటుంది. కాబట్టి విూరు, భర్త, అత్త, ఇతరుకుటుంబ సభ్యులు కలసి ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ తీసుకోండి. ఎవరిలో ఏ లోపముందో గ్రహించి ఎలా మారాలో సూచిస్తారు. అలాగే సైకాలజిస్టు పలు ప్రత్యామ్నాయ మార్గాలు సూచిస్తారు. విూ అత్తలో మార్పు వస్తే అందరు కలసి ఒకే ఇంట్లో వ్ఞండవచ్చు. అలాకాకుంటే విూరు ప్రత్యేకంగా కాపురం పెట్టవచ్చు. విడివిడిగా వ్ఞంటూనే వ్యవసాయం కలిసి చేసుకోవచ్చు. లేదా పంచుకుని ఎవరి వాటా భూమిని వారు సాగు చేసుకోవచ్చు. కాగా మళ్లీ పట్టణానికే వెళ్లి ఇద్దరు ప్రైవేటు ఉద్యోగాలు సంపాదించుకుని జీవించే అవకాశాలు వ్ఞన్నాయి. అలాగే తిరిగి షాపు పెట్టుకుని ఇద్దరు కష్టపడి బతకవచ్చు. విూ అత్తను, ఆమె మాటల్ని మీరు పట్టించుకోవడం మానేసి, కలిసి బతకవచ్చు. కాబట్టి అందరూ కలిసి చర్చించి మంచి నిర్ణయం తీసుకోండి. ముందు భర్తను కలసి చర్చించి సానుకూల మార్గాలు ఆలోచించండి. మీరిద్దరు విడిగా వ్ఞంటూనే అత్తతో మీ ప్రేమను పంచుకోవచ్చు..
డాక్టర్‌ ఎన్‌.బి.సుధాకర్‌రెడ్డి,
సైకాలజిస్టు

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/