విటమిన్ల కలబోత కలబంద

                                 విటమిన్ల కలబోత కలబంద

ALOE VERA
ALOE VERA

అపారమైన ఔషధ గుణాలతో పాటు ఎ,బి,సి,డి,ఇ,- వంటి అత్యంత కీలకమైన విటమిన్లు కలబందలో పుష్కలంగా ఉన్నాయి. ఇందులోంచి లభించే లిపాసెస్‌ అనే ఎంజైము శరీరంలోని కొవ్ఞ్వను చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ప్రొటెనెస్‌ అనే ఎంజైము ప్రొటీన్లు సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బ్రాడికీనెస్‌ అనే ఎంజైము కడుపులోని మంటను అరికట్టడంతో పాటు చర్మాన్ని మృదువ్ఞగా మారుస్తుంది. కలబందలో ప్రధానంగా 20 రకాల వనాలు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్‌, సెలేనియం, సోడియం, మాంగనీసు, కాపరు, క్రోమియం వంటివి సమృద్ధిగా లభిస్తాయి. జీవశక్తికి కావలసిన లవణాలను క్రమబద్ధంగా అందించే ఎలిమెంట్లు కూడా కావలసినంతగా లభిస్తాయి.

కలబందలో ఉండే సలిసైలిక్‌ యాసిడ్‌ అనేది ఒక యాంటీ బ్యాక్టీరియల్‌ ఇంప్లిమెంటరీ. ఇది రక్తం పలుచగా ఉండేలా చేస్తుంది. ఇది పలు రకాల చర్మ సమస్యలను నివారిస్తుంది. కలబందలోని ఆంత్రోక్వినోనెస్‌లో 12 రకాల క్రిమినాశకాలు ఉంటాయి. ఇవి గ్యాస్ట్రో సమస్యలను నివారించడంతోపాటు నొప్పులను తగ్గిస్తాయి. ఇందులోని అలోయన్‌, ఎమోటిన్‌ పెయిన్‌ కిల్లర్సుగానూ, యాంటీ బ్యాక్టీరియా, యాంటి వైరల్‌గానూ ఉపయోగపడుతుంది. కలబందలోని సపోనిన్స్‌ యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. శరీరంలోని బ్యాక్టీరియా, వైరస్‌లను, ఈస్ట్‌ ఫంగైలను నాశనం చేస్తుంది. శరీరానికి కావలసిన 22 యాసిడ్స్‌లో 20 ఈ కలబందలో ఉన్నాయి. దీని ద్వారా దీర్ఘకాలిక మలబ్ధకం, ఎసిడిటి, సైనస్‌, సొరియాసిస్‌, ఎగ్జిమా, రంగు మారడం వంటి చర్మ సమస్యలు తగ్గిపోతాయి.

మధుమేహం, లివర్‌ సమస్యలు, గౌట్‌, ఎముకల నొప్పులు, జుట్టు రాలడం, రక్తహీనత, అధిక బరువ్ఞ వంటి సమస్యలు కూడా నయమవ్ఞతాయి. చాలామందిలో అజీర్తి సమస్య ఉంటుంది. దీనివల్ల తీసుకునే ఆహార పదార్థాల్లోని పోషకాలేవీ శరీరానికి పట్టవ్ఞ. దీనివల్ల శరీరం తరచూ వ్యాధిగ్రస్తమవ్ఞతూ ఉంటుంది. కలబందను తీసుకోవడం వలన జీర్నవ్యవస్థ చక్కబడడంతో పాటు శరీరంలోని వ్యర్థ, విషపదార్థాలు విసర్జించబడతాయి. శరీరం ఆరోగ్యాంనూ, చైతన్యవంతంగానూ మారుతుంది.