విజ‌య‌వాడ ఎస్బీఐలో గోల్డ్ స్కాం

gold

విజ‌య‌వాడ  ఎస్బీఐలో గోల్డ్ స్కాం

విజ‌య‌వాడ గాయత్రి న‌గ‌ర్ ఎస్బీఐలో గోల్డ్ స్కాం వెలుగుచూసింది. ఖాతాదారులు తాక‌ట్టుపెట్టిన 10.2 కిలోల బంగారాన్ని బ్యాంకు ఉద్యోగి కృష్ణ చైత‌న్య మ‌ణ‌ప్పురం గోల్డ్ లో తాక‌ట్టు పెట్టి రూ. 3 కోట్ల రుణం తీసుకున్నాడు. కృష్ణ చైత‌న్య మోసాన్ని గుర్తించిన బ్యాంకు అధికారులు ఈ నెల 18న సీఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన సీఐడి.. మాచ‌వ‌రంలోని మ‌ణ‌ప్పురం కార్యాల‌యం, ఇత‌ర శాఖ‌ల్లో సోదాలు జ‌రిపి కీల‌క డ్యాక్యుమెంట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే బ్యాంకు ఉద్యోగి కృష్ణ‌చైత‌న్య‌తో పాటు ఆయ‌న‌కు స‌హ‌క‌రించిన మ‌ణ‌ప్పురం సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు.