విజ‌య్‌తో విభేదాలు అవాస్తవం: దర్శకుడు మర్రి

EMV
EMV

విజయ్‌ దేవరకొండ హీరోగా శ్రీధర్‌ మర్రి ‘ఏ మంత్రం వేసావే సినిమా రూపొందించారు. శివానీసింగ్‌ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి మర్రి మాట్లాడారు. ‘నేను సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసేవాడిని. సినిమాల పట్ల గల కాంక్షతో ఉద్యోగం వదిలేసి వచ్చాను అని అన్నారు. కొత్త దర్శకులను నమ్మే నిర్మాతలు తక్కువ. కనుక నేను దాచుకున్న డబ్బుతోనే ఈ సినిమా చేశాను. తరిగిపోతున్న మానవ సంబంధాల నేపథ్యంల ఈ సినిమా కొనసాగుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌కి విజయ్‌ దేవరకొండ రాకపోవడంతో, మా ఇద్దరి మధ్య ఏవో విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. నిజానికి మా మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఆయన వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వలన రాలేకపోతున్నాడంతే అంటూ దర్శకుడు చెప్పుకొచ్చారు.