విజయ సూత్రం మరిచిపోయాం : కపుగెదెర

KAPUDERA
KAPUDERA

విజయ సూత్రం మరిచిపోయాం : కపుగెదెర

పల్లెకెలె: శ్రీలంక గెలవడం మరిచిపోయిందని ఆ జట్టు తాత్కాలికసారథి చమర కపుగెదెర అన్నాడు. బలహీనతలను అదిగమించి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలన్నారు. వేరే సమస్యలేవీ లేవు. కానీ మేం విజయ సూత్రం మరిచిపోయాం అని పేర్కొన్నాడు. టీమిండియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో శ్రీలంక ఇప్పటికే వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిన సంగతి తెలిసిందే. చాలా జట్లు ఈ సమస్యతో బాధపడ్డాం చూశా. వరుస ఓటములతో సతమతమవతున్న జట్టు అవకాశం వచ్చినా గెలవలేక పోతోందంటే మేం గెలుపు సూత్రం మరిచిపోయినట్లు లెక్క..! మేం ఒక్కో మ్యాచ్‌ గెలుస్తూ పోవాలి. సమస్యను అధి గమించి జట్టును ఎలా గాడిన పెట్టాలో అంత ర్గతంగా చర్చించాం. చివరి రెండు వన్డేల్లో మా బౌలింగ్‌ చక్కగా ఉంది. ఐతే మా బ్యాట్స్‌మెన్‌ మ్యాచ్‌ను గెలిపించేలా ఆడాల్సి ఉంది. మేం భారీ స్కోరు చేస్తే కచ్చితంగా గెలుస్తాం. ఆట మధ్యలో క్రికెటర్లు బాధ్యత తీసుకొని ఆడాలి. అప్పుడే మేం గెలవగలం. మాకు కొన్ని బలహీనతలు ఉన్నాయి. అందుకే మేం ఓడిపోతున్నాం. వచ్చే మ్యాచ్‌కు ముందే మేం వాటిని కనిపెట్టి సరిచేసుకొని బాగా ఆడాల్సి ఉందని పేర్కొన్నారు.