విజయ్ దేవరకొండ ‘లైగర్’ గ్లింప్స్ విడుదల

విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘లైగర్’ నుండి ఫస్ట్ గ్లింప్స్ విడుదలైంది. డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తున్న చిత్రం లైగర్. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతుంది.

ఇప్పటికే విడుదలైన ‘లైగర్’ ఫస్ట్ లుక్ అనూహ్య స్పందన తెచ్చుకుంది. ఈ క్రమంలో న్యూ ఇయర్ కానుకగా శుక్రవారం సినిమా ఫస్ట్ గ్లిమ్స్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ దేవరకొండను స్లమ్ డాగ్ గా.. ముంబై వీధుల్లో చాయ్ వాలా నుంచి అంతర్జాతీయ బాక్సర్ గా ఎదిగినట్లు చూపించారు. పాన్ ఇండియా మూవీ కావడంతో ముంబై నేపథ్యాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో ‘లైగర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు ఫస్ట్ గ్లిమ్స్ చూస్తే అర్థం అవుతుంది. ఇందులో ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించడానికి విజయ్ దేవరకొండ పడిన శ్రమంతా ‘లైగర్’ గ్లిమ్స్ లో కనిపిస్తోంది. దీని కోసం శిక్షణ తీసుకున్న VD.. కండలు తిరిగిన దేహంతో డిఫరెంట్ మెకోవర్ & యాటిట్యూడ్ తో ఆకట్టుకున్నాడు.

‘వీ ఆర్ ఇండియన్స్’ అంటూ దేశభక్తిని పెంపొందించేలా తన వాయిస్ ని గట్టిగా వినిపించాడు. అలానే చివర్లో ‘వాట్ లగా దేంగే’ అంటూ ప్రత్యర్థులకు వార్నింగ్ కూడా ఇస్తున్నాడు రౌడీ బాయ్. మొత్తం మీద ఈ గ్లిమ్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. వచ్చే ఏడాది ఆగస్టు 25వ తేదీన లైగర్ సినిమాను థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా చిత్రబృందం ప్రకటించింది.

YouTube video