విజయాలు సాధించడమే నాకు ప్రేరణ: కోహ్లీ

Kohli
Kohli

రాజ్‌కోట్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆదివారం తన 29వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయాలు సాధించడమే తనకు ప్రేరణ అని, అటపై అభిరుచి పోయిన మరుసటి రోజే తాను క్రికెట్‌ అడటం
మానేస్తానని అన్నారు. తన శరీరం సహకరించినన్ని రోజులు అటను అస్వాదిస్తానని అలా లేనప్పుడు తానిక క్రికెట్‌లో ఉండబోనని అన్నారు. వెన్నుతట్టి
ప్రోత్సహించే వారుంటే ఓటములు భారం తగ్గుతుందని, మళ్లీ విజయం సాధించేవరకు ప్రయత్నించాలని అనిపిస్తుందని, ఇది క్రీడాకారులకు ఎంతో
అవసరమని అన్నారు.