విజయవాడ వచ్చిన జపాన్‌ బృందం

Japan team

చంద్రబాబు సమక్షంలో జరుగనున్న అవగాహన ఒప్పందం
బృందానికి స్వాగతం పలికిన కంభంపాటి, కలెక్టర్‌ ఎ బాబు
విజయవాడ : మొటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంతో సిఎం చంద్రబాబు సమక్షంలో అవగాహనా ఒప్పందానికి విచ్చేసిన జపాన్‌ దేశంలో తొయా మా రాష్ట్ర గవర్నర్‌ తకకాజు ఇషితో పాటు బృంద సభ్యులకు నదుటపై తిలకందిద్ది, పూలమాలలతో సత్కరించి రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామోహనరావు, కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాబు.ఎలు సంప్రదాయ స్వాగతాన్ని పలికారు.ఈ సందర్భంగా కంభంపాటి రామోహన రావు మాట్లాడుతూ జపాన్‌ గవర్నర్‌తో వచ్చిన బృందం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో పర్యాటకం, మత్స్య పరిశ్రమ, ఫార్మస్యూటికల్‌ రంగం, జిప్‌ల తయారి రంగాలలో పలు కీలక ఒప్పందాలు కుదుర్చు కోనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆధ్వర్యంలో జపాన్‌ గవర్నర్‌, బృంద సభ్యులకు రాత్రి విందు, సోమవారం ఉదయం అల్పాహార విందులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో తొయామా రాష్ట్రగవర్నర్‌ బృందం సమావేశం అవుతుందన్నారు. ఈ సందర్భంగా పలు కీలక ఒప్పందాలు యం.ఓ.యు కుదుర్చుకోవడం జరుగుతుందన్నారు. అనంతరం ముఖ్యమంత్రి జపాన్‌ బృందానికి మధ్యాహ్నపు విందు ఏర్పాటు చేసారన్నారు.ఈ కార్యక్రమంలో జపాన్‌ ఇండియా కాన్పొలేట్‌(చెన్నై) సైజిబాబా, జపాన్‌ బృందం సభ్యులు తొయామా రాష్ట్ర అసెంబ్లీ ఛైర్మన్‌ షికి యెకో యామ, ఆర్ధిక రంగ విభాగం ప్రతినిధులు షిజియో తకాజి, తకాషి ఇనోయి, రైకోహిర, ఫార్మాస్యుటికల్‌ విభాగం నుండి తొషిరో నకాయి, ఎసునోబు ఒల్సుగ, తకహిరో ఒషికావ, కాజులకనోష్‌, మషాసి యెకొలా, మీడియా విభాగం తాయిసుకే హమడా, అకిహిరొ ఉరుషిబాట, హిరోహిసనునో, యోషపుమి బంజా§్‌ు, టొయామా ప్రిఫెక్చర్‌ గవర్నర్‌ ప్రావియన్స్‌ ప్రాంతానికి చెందిన బృంద సభ్యులు టెట్‌ సుజొ కవాల్‌సు, తొషిహికొ తాకెకుమ, మిచికొనొబట, కైకొ సానొలతో పాటు కృష్ణా జిల్లా సబ్‌ కలెక్టర్‌ జి.సృజన, డిసిపి కాళిదాస్‌ తదితరులు ఉన్నారు.