విజయవాడ కోర్టు వర్మకు షాక్

RGV

విజయవాడ కోర్టు  వర్మకు షాక్ 

విజయవాడ: వంగవీటి సినిమాకు సంబంధించి విజయవాడ కోర్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు షాక్ ఇచ్చింది. ఆ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ లపై తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. తమ అభ్యంతరాలను పట్టించుకోకుండా వంగవీటి రంగా జీవిత కథ ఆధారంగా వంగవీటి సినిమాను తీసి తమ కుటుంబాన్ని అవమానించారంటూ వంగవీటి రంగా కుమారుడు రాధాకృష్ణ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.