విజయవాడలో డిజిధన్‌ మేళా ప్రారంభం

AP CM Chandra babu
AP CM Chandra babu

విజయవాడలో డిజిధన్‌ మేళా ప్రారంభం

విజయవాడ: విజయవాడలో డిజిధన్‌ మేళాను సిఎంచంద్రబాబునాయుడు సోమవారం సాయంత్రం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిని ప్రోత్సహించేందుకే తీసుకున్న నిర్ణయమే నోట్ల రద్దు అని అన్నారు. ప్రదాని నిర్ణయాన్ని స్వాగతించిన మొదటి రాష్ట్రం ఎపినే అని అన్నారు.. ఇవాళ ఎక్కడా డబ్బు ల సమస్యల లేకుండా చేసుకోగలిగామన్నారు.. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని అమలుచేశామని, ఈ పరిణామాన్ని బ్యాంకర్లు కూడ ఊహించనేలేదన్నారు. తాము రెండేళ్ల క్రితమే చౌకదుకాణాల్లో ఇపాస్‌ యంత్రాలను ప్రవేశపెట్టామని ఆయనగుర్తుచేశారు.

చెడుపెరిగితే సమాజానికి ప్రమాదం

చెడు పెరిగితే సమాజానికి ప్రమాదమని, కొందరు రాజకీయ నాయకులు సేవ చేయరన్నారు.. ఎన్నికలు వచ్చినపుడు డబ్బులు పంపిణీ చేసి గెలుస్తారని, రాష్ట్రంలో అధికారాన్ని అడ్డ పెట్టుకుని వేలకోట్లు దోపిడీ చేశారన్నారు.