విజయవాడలో ఏపి ఎన్జీవోల ధర్నా

AP NGO's
AP NGO’s

విజయవాడ: సీపీఎస్‌ విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ విజయవాడలో శనివారం ఏపి ఎన్జీవోలు మహా ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో శాసనమండలి సభ్యుడు బొడ్డు నాగేశ్వరరావు, ఏపి ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడతూ…సిపిఎస్‌ విధానం వల్ల ఉద్యోగులకు నష్టం అన్నారు. అలాగే కేంద్రం పరిధిలోని అంశమైనా రాష్ట్రం కూడా చొరవ చూపాలని ,సిపిఎస్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఇతర రాష్ట్రాల ఉద్యోగులతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని వారు పేర్కొన్నారు.