విచ్చ‌ల‌విడిగా బెల్ట్ షాపులు ఏర్పాటు చేస్తే క‌ఠిన చ‌ర్య‌లుః చంద్ర‌బాబు

AP CM BABU
AP CM BABU

అమ‌రావ‌తిః తాను మ‌ర్యాదగా చెబుతున్నాన‌ని, నోటిఫై చేసిన ప్ర‌దేశాల్లో కాకుండా విచ్చ‌ల‌విడిగా
ఎక్క‌డ‌పడితే అక్కడ బెల్టుషాపులు పెడితే ఊరుకోబోమ‌ని ముఖ్య‌మంత్రి చ‌ంద్ర‌బాబు నాయుడు
అన్నారు. మంగ‌ళ‌వారం అమ‌రావ‌తిలో మీడియాతో మ‌ట్లాడిన ఆయ‌న‌ మ‌హిళ‌ల‌కు ఇబ్బందులు
క‌లిగించ‌వ‌ద్ద‌ని, ప్ర‌జ‌ల‌కు ఏమైనా ఇబ్బందులు త‌లెత్తితే 1100 నెంబ‌ర్‌కి ఫోన్ చేసి చెప్ప‌వ‌చ్చ‌ని ,
ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు ప్ర‌తి ల‌బ్ధిదారుడికి అందేలా అధికారులు చూడాల‌ని అన్నారు.తాము
ప్రజలతో అనునిత్యం అనుసంధానం అవుతున్నామ‌ని, పరిపాలనలో ఆధునిక సాంకేతికతను
ఉపయోగించుకుంటున్నామ‌ని తెలిపారు. ఇసుక అక్ర‌మ ర‌వాణాను అరిక‌డ‌తామ‌ని, ఇసుక ధ‌ర‌ల‌ను
స‌మ‌ర్థ‌వంతంగా నియంత్రిస్తున్నామ‌ని, ఇసుక విధానంపై కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు ప్ర‌క‌టించామ‌ని, ఎవ‌రైనా
ఇసుక దందా చేస్తే స‌హించ‌బోమని, పొరుగు రాష్ట్రాల‌కు ఇసుక త‌ర‌లిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని
చెప్పారు. ఇసుక‌, మ‌ద్యం విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త పాల‌సీల‌పై ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం
చేశారని, అంత‌ర్ రాష్ట్ర స‌రిహ‌ద్దుల్లో సీసీటీవీలు, చెక్‌పోస్టులు ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఆయ‌న‌
తెలిపారు.