విచారణకు హాజరైన టివి9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌

cyber crime police station
cyber crime police station

హైదరాబాద్‌: టీవి9 వివాదంలో పోలీసుల ఆదేశాల మేరకు టివి9 ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి శుక్రవారం మధ్యాహ్నం సైబర్‌ క్రైమ్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. టివి9లో యాజమాన్యంలో తలెత్తిన వివాదాలపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అలంద మీడియా డైరెక్టర్‌ కౌశిక్‌రావు ఫిర్యాదు మేరకు టివి9 సిఈఓ రవిప్రకాశ్‌, ఫైనాన్స్‌ డైరెక్టర్‌ మూర్తి, సినీనటుడు శివాజీపై సైబరాబాద్‌ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రవిప్రకాశ్‌, శివాజీ, మూర్తి ఇళ్లతో పాటు టివి9 కార్యాలయంలో సోదాలు నిర్వహించిన పోలీసులు..ఇవాళ ఉదయం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. కాని రవిప్రకాశ్‌, శివాజీ ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు. వీరు ఇవాళ విచారణకు హాజరుకాకపోతే మరోసారి నోటీసులు జారీ చేయాలని సిసిఎస్‌ పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/