విక్రమ్‌ సినిమాలో రీతూవర్మ!

RITU VARMA
RITU VARMA

విక్రమ్‌ సినిమాలో రీతూవర్మ!

హీరోయిన్‌ గా చేసింది ఒకే ఒక్క సినిమా.. కానీ ఇప్పుడు ఓ స్టార్‌ హీరో సినిమాలో నటించే అవకాశం కొట్టేసింది రీతూవర్మ. ఆమె నటించిన పెళ్ళిచూపులు సినిమా ఘన విజయం సాధించడంతో అమ్మడుకి మంచి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. రీతూ తనకు నచ్చిన ప్రాజెక్ట్స్‌ ఓకే చెబుతూ ముందుకు వెళుతోంది. ఈ క్రమంలో ఆమెకు విక్రమ్‌ తో కలిసి నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. గౌతమ్‌ మీనన్‌, విక్రమ్‌ కాంబినేషన్‌ లో తమిళంలో రూపొందుతోన్న చిత్రం ధ్రువ నచ్చతిరం. ఈ సినిమాలో మొదట హీరోయిన్‌ గా అను ఎమ్మాన్యూయల్‌ ను తీసుకున్నారు. కానీ ఆమె డేట్స్‌ సర్ధుబాటు చేయలేక ప్రాజెక్ట్‌ నుండి తప్పుకుంది. దీంతో గౌతమ్‌ మీనన్‌, రీతూవర్మను ఈ సినిమా కోసం రంగంలోకి దింపాడు. ఈ సినిమా విక్రమ్‌, రీతూ వర్మల పాత్రలు టిపికల్‌ హీరో, హీరోయిన్‌ లా కాకుండా ఇద్దరిమధ్య మెచ్యూర్డ్‌ రిలేషన్షిప్‌ ఉంటుందని సమాచారం. ఇప్పటికే రీతూ ఈ సినిమా షూటింగ్‌ లో కూడా పాల్గొందని తెలుస్తోంది. మరి ఈ సినిమాతో అమ్మడుకి కోలీవుడ్‌ అవకాశాలు కూడా వస్తాయేమో చూడాలి!