వికారాబాద్‌లో గులాబీ గూటికి చేరిక‌లు

TRS flag
TRS

వికారాబాద్: జిల్లాలోని తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ లకు చెందిన 200 మంది కార్యకర్తలు శనివారం టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి మహేందర్‌రెడ్డి వీరందరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులు, యువత, మైనారిటీ, కుల వృత్తులను సీఎం కేసీఆర్ కోట్లాది నిధులతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. నమ్మకంతో పార్టీలో చేరిన ప్రతిఒక్కరికి అండగా ఉంటామని పేర్కొన్నారు.