వికారానికి విరుగుడు

pain
pain

వికారానికి విరుగుడు

మనలో చాలా మంది ప్రయాణం అంటే వెనకడుగు వేస్తారు. ఎందుకంటే కారు, బస్సు ఏ వాహనమైన ఎక్కితే వాంతులు రావడం, వికారం కలగడం జరుగుతుంది. మరికొందరికి అనారోగ్యం వల్ల కూడా వాంతులు రావడం జరుగుతుంది. ఇలాంటి వికారాలను తగ్గించుకోవాలంటే…
అరస్పూన్‌ అల్లం రసం, అరస్పూన్‌ పుదీనారసం కలిపి తీసుకుంటే వాంతులు అరికట్టవచ్చు.

ప్రయాణంలో ఉన్నప్పుడు నిమ్మకాయ వాసన చూస్తున్నా, జడను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూస్తున్నా ఫలితం ఉంటుంది. ఆల్‌బుకార్‌ పండు తినవచ్చు.

నిమ్మకాయతో చేసిన ఊరగాయ చప్ప రించినా పైత్యం, వికారం తగ్గుతాయి. ్య నిమ్మకాయ చెక్కపై (సగానికి సగం) మిరియాల పొడి చల్లి, కొంచెం వెచ్చచేసి చప్పరించాలి. లవంగం పొడిచేసి నీటిలో కలిపి తాగితే ఫలితం ఉంటుంది

యాలకులు, జీలకర్ర, లవంగం, దాల్చినచెక్క, పటికబెల్లం, ఉసిరికాయ వీటిల్లో ఏదైనా నోట్లో ఉంచుకుని చప్పరిస్తుంటే వాంతులు ఆగిపోతాయి.
నిమ్మరసంలో సోడా ఉప్పు వేసి పొంగు రాగానే తాగాలి. వాము, ధనియాలు, జీలకర్ర సమా నంగా వేయించి వాటితో కషాయం చేసుకుని తాగచ్చు.