వింబుల్డన్‌ ఫైనల్లోకి ముగురుజ, వీనస్‌

Muruguja, Venus
Muruguja, Venus

వింబుల్డన్‌ ఫైనల్లోకి ముగురుజ, వీనస్‌

లండన్‌: వింబుల్డన్‌ మహిళల సింగిల్స్‌లో ముగురుజ, వీనస్‌ విలియమ్స్‌లు ఫైనల్లో అడుగుపెట్టారు. సెమీఫైనల్లో భాగంగా రిబరికోవాతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి ముగురుజ ఫైనల్లో అడుగు పెట్టింది. అత్యంత ఏకపక్షంగా సాగిన ఈమ్యాచ్‌లో 14వ ర్యాంకర్‌ స్పెయిన్‌ క్రీడాకారిణి గార్బిన్‌ ముగు రుజా అన్‌సీడెడ్‌ స్లొవేకియా క్రీడాకారిణి మగ్దలెనా రిబరికోవాపై 6-1,6-1 తేడాతో విజయం సాధిచింది. కేవలం 64నిమిషాల్లోనే మ్యాచ్‌ ముగిసింది. ముగురుజ వింబుల్డన్‌ ఫైనల్‌కు చేరడం గత మూడేళ్లలో ఇది రెండోసారి. 2015లో జరిగిన ఫైనల్‌లో సెరెనా విలియమ్స్‌ చేతిలో ఓటమిపాలైంది. మ్యాచ్‌ అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇవాళ తాను చాలా బాగా ఆడానని…కోర్టులో మంచి విశ్వాసంతో బరిలోకి దిగానని చెప్పారు. అన్నీ అనుకూలంగా జరిగాయని పేర్కొన్నారు. ప్రస్తుతం తాను బాగా ఆడుతున్నానని ఆఖరి మ్యాచ్‌లో ఇదే ఆటతీరును కనబరచగలనని ధీమా వ్యక్తం చేశారు. మరో మ్యాచ్‌లో అమెరికా క్రీడాకారిణి మాజీ ఛాంపియన్‌ వీనస్‌ విలియమ్స్‌ అన్‌సీడెడ్‌ ఇంగ్లాండ్‌ క్రీడాకారిణి జొహన్నా కొంటాపై 6-4,6-2తో విజయం సాధించి ఫైనల్లోకి అడుగుపెట్టింది.

సానియా ఔట్‌…క్వార్టర్స్‌లో బోపన్న… వింబుల్డన్‌లో భారత్‌ టెన్నిస్‌ స్టార్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మిక్స్‌్‌డ్‌ డబుల్స్‌లో సానియా జోడీ నిష్క్రమించగా రోహన్న బోపన్న ద్వయం క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. మూడో రౌండ్‌ పోరులో సానియా -క్రొయేషియా క్రీడాకారిణి ఇవాన్‌ దొడిగ్‌ల ద్వయం 6-7, 4-6 తేడాతో డిఫెండింగ్‌ ఛాంపియన్‌్‌స ఫిన్‌ లాండ్‌ క్రీడాకారిణి హెన్రీ-అమెరికా క్రీడాకారుడు హేథర్‌ వాట్సన్‌లజంట చేతిలోఓడింది. బోపన్న-కెనడా క్రీడాకారిణి గాబ్రియేల్‌ దబోస్కిల జంట 7-6, 6-2తేడాతో క్రొయేషియా క్రీడాకా రుల జోడీ నికోల మెక్‌టిక్‌, అనాకొంజును మట్టికరిపించింది. క్వార్టర్స్‌లో బోపన్న ద్వయం కొంటినెన్‌,వాట్సన్‌తో తలపడనుంది.