వింత చేపలు

తెలుసుకో..

This slideshow requires JavaScript.

వింత చేపలు

సముద్ర గర్భంలో ఎన్నో రకాల చేపలు ఉంటాయని మనకు తెలుసు కాని కొన్నిటి గురించి మనం అసలేమీ విని ఉండం. అలాంటివే అయిదు రకాల చేపలు. ఈ అయిదు రకాల చేపలలో మొదటి చేప పేరు బ్లాబ్‌ ఫిష్‌, సముద్రం అడుగున నేలకు దగ్గరగా ఉండి తినదగ్గ ప్రతి చిన్న జీవినీ ఆరగించే చేప ఇది. అంతా కొవ్వే తప్ప కండ ఏమీ ఉండదు దీనికి. ఏ పని చేయకుండా నేలనే అంటిపెట్టుకుని ఉంటుంది. రెండోది ఫైర్‌ఫ్లై స్క్విడ్‌. మన మిణుగురు పురుగు లాంటిది. కాకపోతే ఇది నీలికాంతుల్ని వెదజల్లుతూ తిరుగుతుంటుంది. ఆసియా సముద్రాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ఒక మూడవ రకం చేప వైపర్‌ ఫిష్‌. రాక్షసిలాంటి నోరు, ఆ నోటిలో ఈటెల్లాంటి పళ్లు. శరీరమేమో పాములా ఉంటుంది. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది. ఇక నాలుగవది ప్లాస్టిక్‌ డబ్బాలో తేలుతున్నట్లుండే ఈ చేప పేరు స్విమ్మింగ్‌ సీ కుకుంబర్‌. లోపల వంకీలు తిరిగి కనిపించేది దాని జీర్ణకోశం. ఇవి కూడా సముద్రాల అడుగున తేలుతూ తిరుగుతుంటాయి. చివరిది వాంఫైర్‌ స్క్విడ్‌. ఇది ఒంటికన్ను రాకాసిలా ఉంటుంది. బాగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో నివసించే ఈ చేపకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంతసేపు కావాలంటే అంతసేపు వెలుగును ప్రసరించే శక్తి ఉంటుంది. దానితోనే అది ఇతర జీవ్ఞలను ఆకర్షించి ఆహారంగా స్వీకరిస్తుంది.