విండీస్‌తో సిరీస్‌లో మయాంక్‌కు స్థానం

MAYANK AGARWAL
MAYANK AGARWAL

ముంబై: తదుపరి సిరీస్‌ వెస్టిండీస్‌తో జరగబోయే రెండు టెస్టుల కోసం కర్ణాటక ఆటగాడు మయాంక్‌ అగర్వాల్‌ బిసిసిఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. మంచి ఫామ్‌తో జట్టులో స్థానం సంపాదించిన మయాంక్‌ ..దేశవాళీ సీజన్‌లో కూడా పరుగుల వరద పారించాడు. ఓ ఇంగ్లీషు ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియాలో మీకు ప్రేరణ కలిగించిన వ్యక్తి ఎవరు? అన్న ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ… తన మీద రాహుల్‌ ద్రావిడ్‌ ప్రభావం ఉందని , ఆయనిచ్చిన ప్రేరణతోనే జట్టులో స్థానం సంపాదించగలిగానని మయాంక్‌ అన్నాడు. ఆయనిచ్చే సలహాలు, సూచనలు నేను ఎప్పుడూ పాటిస్తుంటానని, అవి నాకో ఎన్నో సందర్భాల్లో ఉపయోగపడ్డాయి అని తెలిపాడు.