వాహ‌న‌దారుల‌కు ఊర‌ట‌! పెట్రోల్ బంకుల డీల‌ర్ల స‌మ్మె విర‌మ‌ణ

petrol bunks
petrol bunks

ఢిల్లీః త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోరుతూ పెట్రోల్ బంకుల డీల‌ర్లు ఈ నెల 13న స‌మ్మెను నిర్వ‌హించ‌నున్నామ‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ రోజు మ‌రోసారి స‌మావేశ‌మైన పెట్రోల్ బంక్ డీల‌ర్ల అసోసియేష‌న్ త‌మ స‌మ్మెను విర‌మించుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకుంటున్నారు. పెట్రోల్ బంకు డీల‌ర్లు స‌మ్మెకు దిగితే దేశ వ్యాప్తంగా మొత్తం 54,000 పెట్రోల్ బంక్స్ రేపు అర్ధ‌రాత్రి నుంచి 24 గంట‌ల పాటు మూత‌ప‌డేవి.