వాషింగ్టన్లో మంచు తుఫాన్: 6వేల విమాన సర్వీసుల రద్దు
వాషింగ్టన్: అమెరికాలో భీభత్సం సృష్టిస్తున్న మంచుతుఫాన్తో 6 వేలకు పైగా విమాన సర్వీసులను అధికారులు రద్దుచేశారు. కుండపోతగా మంచు కురుస్తుండటంతో రోడ్లుపైరెండు అడుగుల మేర మంచుకు పేరుకుపోయింది. దీంతో అధికారయంత్రాంగం మంచును తొలగించే పనుల్లో ఉన్నారు. అమెరికాలోని వాషింగ్టన్, న్యూయార్క్, కరోలినా, అర్కాన్సాన్ తదితర ప్రాంతాల్లో మంచు తుఫాన్ కారణ:గా సుమారు కోటి మందికి పైగా ప్రజలకు ఇళ్లల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది.