వాలేచా మరో 13 సంస్థలపై సెబి మార్కెట్‌ నిషేధం

SEBI-logo
న్యూఢిల్లీ : స్టాక్‌ మార్కెట్ల పర్యవేక్షణ సంస్థ సెబి వాలేచా ఇంజనీరింగ్‌ సంస్థ మరో 13 సంస్థలపై మూడేళ్లపాటు మార్కెట్లలో ట్రేడింగ్‌పై నిషేధం విధించింది. వాలేచా సంస్థ జారీ చేసిన ప్రాధాన్యతా కేటాయింపుల్లోని బదిలీ ఆస్కారం ఉన్న వారంట్ల జారీలో అవకతవకలు జరిగినట్లు గుర్తించింది. 2005లో ఈ అవక తవకలు వెలుగులోకి వచ్చాయి. అంతేకాకుండా సహజ ట్రేడింగ్‌, మోసపు ట్రేడింగ్‌ లేని కంపె నీలపై కూడా వేటు వేసింది. వాలేచా ఇంజనీ రింగ్‌ ప్రాధాన్యతపరమైన కేటాయింపుల పరంగా 14,23,900 బదిలీచేయదగిన వారంట్లను కేటాయింపులు చేసింది. వీటన్నింటినీ ఈక్విటీ షేర్లకింద మార్పిడి చేసుకోవచ్చని ప్రకటించింది. వాలేచా ఇంజనీరింగ్‌తో పాటు ఇతర ప్రాధాన్యత షేర్ల కేటాయింపు దారులు కూడా ఒకరికొకరు కనెక్ట్‌ అయి ఉన్నారు. కంపెనీ ఎండిగా జగదీష్‌ వాలేచా ఈ మొత్తం వ్యవహారానికి బాధ్యులని సెబీ ప్రకటించింది. సెబి వివరాలప్రకారం కొన్ని సంస్థలు ఈతరహా బోగస్‌ లావాదేవీలు చేసినట్లు ప్రకటిం చింది. ప్రత్యేకించి వాలేచా ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ కు సంబంధించి ప్రాధాన్యతా కేటాయింపుల్లోనే అవకతవకలు జరిగినట్లు ప్రకటించింది. మొత్తం 14 సంస్థలను నిధుల సమీకరణ కార్యకలాపాల నుంచి నిషేధించింది. ప్రజ ల నుంచి లేదా సంస్థలు, వ్యక్తులనుంచి నిధులు సమీకరించడం, కొనుగోలు చేయడం, అమ్మడం వంటి లావాదేవీల నిర్వహించకూడదు. సెక్యూరిటీ ట్రేడింగ్‌ వ్యవ హారాలు, నేరుగాకానీ, పరోక్షంగా కానీ చేసేందుకు వీలులేదని సెబి ప్రకటించిం ది. మొత్తం ఏడు సంస్థలపై మూడేళ్ల పాటునిషేధం ప్రకటించింది. మరోమూడు సంస్థలపై రెండేళ్లపాటు నిషేధం విధించ గా మిగిలిన సంస్థలపై ఒకఏడాది నిషేధం విధించింది. ఇక ప్రస్తుతం వాలేచా కేటాయించిన ప్రాధాన్యత కేటాయింపులు డీమా ట్‌ ఖాతల్లో ఉన్నాయని, ఈ ఖాతాలను స్తంభింప చేస్తామని ప్రకటించింది. అంతేకాకుండా ఈషేర్లు కేటాయింపులు పొందిన వారికి ఎటువం టి ఓటింగ్‌ హక్కులు ఉండవని స్పష్టం చేసింది.