వార్డు మెంబ‌రు కాలేని వీర్రాజు సియంపై విమ‌ర్శ‌లుః న‌క్కా

Nakka Anandbabu
Nakka Anandbabu

గుంటూరుః బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై రాష్ట్ర మంత్రి నక్కా ఆనందబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ… వార్డు మెంబర్‌గా గెలవలేని సోము వీర్రాజు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అలాగే జగన్‌మోహన్‌రెడ్డి ఏజెంట్‌గా సోము వీర్రాజు యాక్టివ్‌గా పనిచేస్తున్నారన్నారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, బీజేపీ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి అన్నారు. అలాగే అమరావతికే నిధులు ఇవ్వని బీజేపీ రెండో రాజధాని అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.