వారి జీవితమంతా కన్నీటి గాయాలే..

నేడు అంతర్జాతీయ ఎయిడ్స్‌ డే

LADY
Sarrow

వారి జీవితమంతా కన్నీటి గాయాలే..

పిల్లల్లో ఎయిడ్స్‌ శిశువులకు గర్భంలో ఉన్నప్పుడు కాని, జనన సమయంలో కాని, లేదా తల్లిపాలు తాగుతున్న సమయంలో కాని హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఉంది. అలాగే రక్తమార్పిడి సమయంలో కూడా హెచ్‌ఐవి సోకవచ్చు. శిశువు లకు హెచ్‌ఐవి ఉందేమో పరీక్షించి, వారికి అవకాశవాద వ్యాధులు సోకకుండా తగిన చర్యలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలి. సాధారణంగా హెచ్‌ఐవి సోకిన శిశువులలో ఏడాదిలోపుగానే అది ఎయిడ్స్‌గా మారుతుంది. రెండేళ్ల ప్రాయానికే వారు మృత్యువాత పడతారు. కొద్ది మందిలో మాత్రం హెచ్‌ఐవి అలాగే ఉండి, వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటారు. పెద్ద లక్షణాలు: బరువు తగ్గిపోవడం, లేదా ఎదుగుదల నిలిచిపోవడం నెలకు పైగా తీవ్రమైన విరేచనాలు నెలకు పైగా కొనసాగుతున్న జ్వరం చిన్న లక్షణాలు శరీరంలో కనీసం రెండు చోట్ల లింఫు గ్రంథులు 0.5 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో వాయడం, నోటిలోనూ, గొంతులోనూ కాండిడల్‌ ఇన్‌ఫెక్షన్‌ చెవిలోనూ, గొంతులోనూ పదే పదే ఇన్‌ఫెక్షన్లు వస్తూండం, నెల రోజులకు పైగా నిరంతరం దగ్గు వస్తుండటం, చర్మానికి సోకే సాధారణమైన అంటువ్యాధులు ప్రసవ సమయంలో సోకే హెచ్‌ఐవి ఇన్‌ఫెక్షన్‌. పిల్లలకు హెచ్‌ఐవి సోకిందని నిర్ధారించడానికి ముందు పైన పేర్కొన్న పెద్ద, చిన్న లక్షణాల నుంచి కనీసం రెండేసి లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి.

ఎయిడ్స్‌ అంటే?

క్వైర్డ్‌ అంటే – వ్యాధి ఆనువంశికంగా వచ్చినది కాదు. మనిషి వ్యాధి కారక క్రిములకు గురైన కారణంగా సోకినదని అర్థం. (ఈ వ్యాధికి సంబంధించి మనిషి హెచ్‌ఐవి క్రిములకు గురి కావడం) ఇమ్యునో డెఫిషియెన్సీ అంటే – వ్యాధి నిరోధక శక్తి బలహీనపడటం ద్వారా వ్యాధి సోకే అవకాశం పెరగడం సిండ్రోమ్‌ అంటే – వ్యాధి లక్షణాల సముదాయం. ఎయిడ్స్‌కు సంబంధించి కొన్ని రకాల ఇన్‌ ఫెక్షన్లు, కేన్సర్లు మొదలైన వాటి లక్షణ సముదాయం, రక్తంలో వ్యాధి సోకకుండా నిరోధించే సిడి4+ టి సెల్స్‌ వంటి ప్రత్యేక కణా ల సంఖ్య తగ్గిపోవడం.ఎయిడ్స్‌ మరణాలు ఎయిడ్స్‌ కారణంగా ప్రపం చవ్యాప్తంగా 1981 సంవత్సరంనుంచి 2007 వరకూ 25 మిలియన్ల మంది మరణించారు.హెచ్‌ఐవి సోకే అవకాశాలు అధికంగా ఉన్న ప్రవర్తనలను రిస్క్‌ బిహేవియర్‌ అని వ్యవహరిస్తారు. అలాగే హెచ్‌ఐవి సోకే అవకాశాలు లేని ఆరోగ్యకరమైన ప్రవర్తనను నోరిస్క్‌ బిహేవియర్‌ అని వ్యవహరిస్తాం.
నేడు అంతర్జాతీయ ‘ఎయిడ్స్‌డే.

ప్రపంచమంతా ఎయిడ్స్‌కు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. మానవత్వంతో ఈ వ్యాధిగ్రస్తులను ఆదరించాలని ఎలుగెత్తి చాటిచెబుతున్నది. అయినా మనిషిలో మార్పు రావాల్సి నంతగా రావడం లేదేమో అని కోమలి జీవిత అనుభవం బట్టి అనిపిస్తుంది. కోమలి అందరి అమ్మాయిల్లా చక్కగా చదువ్ఞకుని, ఉన్నతమైన కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నది. ఒకసారి కంపెనీ పనినిమిత్తం విదేశాలకు వెళ్లి, కొన్నిరోజులు అక్కడ ఉండి వచ్చింది. ఇండియాకు వచ్చిన తర్వాత ఆమెకు అనారోగ్యం వచ్చింది. ఆరోగ్యపరీక్షల్లో తనకు ఎయిడ్స్‌ సోకిందని తెలుసుకుని, షాక్‌కు గురైంది. తనేతప్పు చేయలేదు. మరి తనకు ఈ వ్యాధి ఎలా సోకింది? అంతుపట్టని వేదన, సమాజం దృష్టిలో చెడిపోయిన దానిగా ముద్ర. అవమానం, రోగబాధ రెండింటితో పోరాడి, జీవితకాలాన్ని మరికొంతకాలాన్ని పెంచుకోవాలని తపించింది.

ఆ దిశగా వైద్యసాయం పొందేందుకు ప్రయత్నించింది. వైద్యసాయంతో విజయాన్ని పొందే అవకాశాన్ని పొందుతున్నా, మానసిక సంఘర్షణలో విఫలమైపోయింది. సమాజం, కుటుంబ సభ్యుల సూటిపోటి మాటలకు ఆమె అలసిపోయి, చివరికి కన్నుమూసింది. కాలం గర్భంలో అర్థాంతరంగా తనువ్ఞ చాలించింది. చదువ్ఞలో, ఉద్యోగంలో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించినా, సమాజం ఇవ్వలేని మనోధైర్యంతో కన్నుమూసింది. కావ్య జీవితచరిత్ర మరోవిధంగా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని పెళ్లికి ఒప్పుకుని, వివాహం చేసుకుంది. ఉద్యోగరీత్యా తను ఒకచోట, భర్త ఒకచోట ఉండేవారు. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి, ట్రాన్సఫర్‌ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్న సమయంలో, హఠాత్తుగా కావ్య భర్త మరణించినట్లుగా ఫోన్‌ వచ్చింది. అనారోగ్యంతో మరణించినట్లుగా అనుకుంది, కానీ ఆయన ఎయిడ్స్‌తో చనిపోయినట్లుగా తెలుసుకుని, క్షణమైనా ఆలస్యం చేయకుండా, వైద్యపరీక్షలు చేయించుకుంటే తనకు కూడా హెచ్‌ఐవి పాజిటివ్‌ అని తేలింది. కాళ్లకింద భూమి వణికిపోయినట్లుగా భయపడిపోయింది. అయినా జీవించాలనే తపనతో వైద్యసాయంతో పోరాడుతుంది. ఎవరికీ ఏహాని చేయని తనకు భర్త హింసపెడుతున్నా భరించాను, పిల్లలు పుట్టకపోయినా ఆ బాధను దిగమింగాను, ఇప్పుడు ఈరోగంతో పోరాడాల్సి వచ్చిందనే వేదన ఆమెను క్షణక్షణం వ్యధకు గురిచేస్తుంది. ఒంటరిగా మనసు గాయాల కన్నీళ్లతో జీవిస్తున్నది. సంధ్య జీవితం మరోవింత. భర్త చాలాచాలా మంచివాడు. కానీ నర్సుల నిర్లక్ష్యంతో అతని శరీరంలో హెచ్‌ఐవి పాజిటివ్‌ లక్షణాలు చేరాయి. దీంతో అతను కొంతకాలానికి మరణించాడు. సంధ్య బాధ వర్ణనాతీతం. ఎంతో అమితంగా ప్రేమించే భర్త చావ్ఞతో ఏర్పడిన ఎడబాటును భరించలేకపోయింది.

దీంతో ఆరునెలలుగా భోజనం చేయకుండా, భర్త గురించే ఆలోచిస్తూ, సంధ్యా కూడా మరణించింది. ఆమె ఇద్దరు మగబిడ్డల పెంపకం బాధ్యత సంధ్య తల్లిదండ్రులపై పడింది. దురదృష్టం ఎంతగా వెంటాడుతుంది అంటే సంధ్య ఇద్దరు పిల్లలకు కూడా హెచ్‌ఐవి పాజిటివ్‌తో బాధపడుతున్నవారే. అయినా కూడా ఆ పిల్లలు కాలేజీ చదువ్ఞతూ, ఇలాంటి ఎయిడ్స్‌ రోగులకు సాయం చేస్తూ, సామాజిక సేవలో తమవంతు సేవలను అందిస్తూ, అందరి మన్ననల్ని పొందుతున్నారు. తాము ఒక బాధను అనుభవిస్తున్నా, తమలాంటి బాధను అనుభవించేవారికి చేయూతనివ్వడం ప్రశంసనీయం. మానసది హర్షణీయమైన జీవితం. భర్తకు హెచ్‌ఐవి పాజీటివ్‌ ఉందని తెలుసుకున్న వెంటనే మానస భర్తకు విడాకులు ఇచ్చి, అతనికి దూరంగా జీవించసాగింది. తద్వారా వెంటనే వైద్యసాయంతో తనలో హెచ్‌ఐవి పాజిటివ్‌ ప్రారంభదశలోనే ఉందని తెలుసుకుని, ఆ జబ్బునుంచి త్వరగా కోలుకుంది. అంతటితో ఆగకుండా ప్రభుత్వ ఉద్యోగానికి కృషిచేసి, ఆ ఉద్యోగాన్ని పొంది, హాయిగా జీవిస్తున్నది. మళ్లీ పెళ్లివైపు చూడలేదు. ఆ ఆలోచనకు చోటుకూడా ఇవ్వకుండా, తన బతుకు తాను చీకుచింతా లేకుండా జీవిస్తున్నది. ఒక కోమలి, ఒక కావ్య, ఒక సంధ్య, మరో మానస ఎయిడ్స్‌ వ్యాధికి గురై, బాధను అనుభించినవారే. భర్తలు చేసిన తప్పులకు శిక్షను అనుభవించి, అర్థాంతరంగా తనుపు చాలించిన వారు కొందరైతే, మరికొందరు ఆ వ్యాధితో పోరాడుతున్నారు. ఏదిఏమైనా ఎయిడ్స్‌ అనేది ఒక భయంకరమైన వ్యాధి మాత్రమే కాదు, అది నివారణ లేని జబ్బు. కాబట్టి విచ్చలవిడి లైంగిక సంబంధాలకు దూరంగా ఉండి, భాగస్వామితో జీవించడమే నైతికవిలువని, తద్వారా ప్రేమ, అనురాగంతో దాంపత్యజీవనాన్ని సాగించాలనే ఒక నైతికసూత్రాన్ని దీనిద్వారా అలవర్చుకుని, ఒక నీతిసూత్రంతో ముందుకు సాగిపోదాం.