వారి ఆశయాలకు కట్టుబడి ఉంటాను: లోకేష్‌

Nara Lokesh
Nara Lokesh

అమరావతి: ఏపి మంత్రి నారా లోకేష్‌పై పవన్‌ చేసిన వ్యాఖ్యలకు లోకేష్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌కు చెడ్డ పేరు తీసుకొస్తున్నారన్న విమర్శలకు కౌంటర్‌ ఇచ్చారు. ఈ రోజు అసెంబ్లీలో మాట్లాడుతూ తన తాత ఎన్టీఆర్‌, తండ్రి చంద్రబాబుల మాదిరి తాను మంచి పేరు తీసుకురాకపోయినా వారికి చెడ్డపేరు మాత్రం తీసుకురానని అన్నారు. వారి ఆశయాలకు కట్టుబడి ఉంటానని చెప్పారు. ఎన్ని ఒడిదుడులకులనైనా పోరాటం చేశారని తెలిపారు. నిరంతరం ప్రజల కోసమే తపిస్తుంటాని కుటుంబం కోసం కూడా ఏనాడూ ఆలోచించలేదని చెప్పారు. యువకులకు చంద్రబాబు ఓ రోల్‌ మోడల్‌ అని అన్నారు. హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీని కట్టిన సమయంలో రాళ్లు రప్పల మధ్య ఈ బిల్డింగ్‌ ఏంటని తాను అనుకున్నానని దాని ఫలితం ఏంటో ఇప్పుడు తెలుసని చెప్పారు. తాను ఎప్పుడు ఇంటికి వెళ్లినా కనీసం వెయ్యి మంది ఆయన కోసం ఇంటి వద్ద ఉండేవారని తెలిపారు.