వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ

virat kohli
virat kohli

న్యూఢిల్లీ: హంద్వారా లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఐదుగురు భారత జవాన్‌లకు భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నివాళులు అర్పించాడు. ఏ కష్టంలో అయినా.. తమ భాధ్యతను మర్చిపోకుండా చేసేవారే నిజమయిన హీరోలు. వారి త్యాగాలు ఎప్పటికి మర్చిపోలేము. హంద్వారాలో అమరులైన సైనికులు, పోలీసులకు నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. వారి కటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, జవాన్‌ల ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అంటూ విరాట్‌ ట్వీట్‌ చేశాడు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/