వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తాం
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్: లాక్డౌన్ కారణంగా రాష్ట్రంలో 40 రోజులుగా మద్యం దుకాణాలు మూసి ఉంచిన విషయం విధితమే. అయితే ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని కొందరు గుడుంబా తయారు చేసి అమ్ముతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ… గుడుంబా అమ్మకాలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు. గుడుంబా తయారి చేసినా.. అమ్మకాలు జరిపినా వారిపై పీడీయాక్ట్ నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/