వారిని కోచ్‌లుగా మార్చుకునేందుకు ఇదో మంచి అవకాశం

pv sindhu
pv sindhu

హైదరాబాద్‌: కరోనా మహామ్మారి కారణంగా ప్రపంచదేశాలు లాక్‌డౌన్‌ ను విధించడంతో, మన దేశానికి విదేశి కోచ్‌లు వచ్చే అవకాశం లేనందున, భారత్‌ కు చెందిన మాజి ప్లేయర్‌లను, కోచ్‌లుగా మార్చుకోవాలని స్టార్‌ షట్లర్‌ పివి సింధు అన్నారు. కరోనా వైరస్‌ వల్ల ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితల్లో విదేశి కోచ్‌లు భారత్‌కు రావడం చాలా కష్టం. అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన ఎందరో మాజీ ప్లేయర్లు మనకున్నారు వారందరిని కోచ్‌లుగా ఉపయోగించుకునేందుకు ఇదో మంచి అవకాశం అని స్పోర్ట్స్‌ అథారిటి ఆఫ్‌ ఇండియా (సాయ్ ) కొత్తగా నిమయించిన అసోసియేట్‌ డైరెక్టర్‌లు నిర్వహించిన ఆన్‌లైన్‌ సెషన్‌లో సింధు సూచించింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/