వారితో చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌స‌క్తే లేదు!

Trump
Trump

వాషింగ్ట‌న్ః ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్ల దాడులు కొనసాగినంత కాలం తాను వారితో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సృష్టం చేశారు. ఒక మీడియా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన దాడులపై స్పందన కోరినపుడు జవాబిస్తూ ప్రస్తుతానికి తాలిబన్లతో చర్చలు జరపాలని అమెరికా కోరుకోవటం లేదన్నారు. తాలిబన్లను ఓడించేందుకు ఇంకా ఏం చేయాలన్న అంశంపై ఐరాస భద్రత మండలి ప్రతినిధులతో తాను చర్చిస్తానన్నారు. కాబూల్‌లో సైనిక శిబిరంపై జరిగిన మిలిటెంట్‌ దాడిలో కనీసం 11 మంది సైనిక జవాన్లు, నలుగురు మిలిటెంట్లు మరణించిన విషయం తెలిసిందే. ఈ నెలలో ఇది ఏడో పెద్ద దాడి కావటం విశేషం.