వారసత్వ ఒరవడికి స్వస్తి పలకడం అవసరం

Political leadership

వారసత్వ ఒరవడికి స్వస్తి పలకడం అవసరం

దేశంలో రాజకీయాలు గమనిస్తే నేతలుగా ఉన్న ఉద్ద్ధండ పిండాల నుండి రాజకీయ వారసత్వం మెల్లగా కుమారులు లేదా కుమార్తెల చేతిలోకి మార్చబడు తుంది. గత ఐదేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతున్నా ఇప్పుడు దేశ వ్యాప్తంగా తారాస్థాయిలో జరుగుతుంది. ఎమర్జెన్సీకాలం నుండి ఉన్న నాయ కులంతా విశ్రాంతి మూడ్‌లోకి వెళ్తున్నారు. వయసు, కేసులు వారసత్వ సెంటిమెంట్‌ కారణాలనేకం. ఇటీవల రాహుల్‌ గాంధీ ఇచ్చిన ‘రాజకీయ వారసత్వ మద్దతు ప్రకటనతో దేశంలో ఒక్క సారిగా సెగలు పుట్టించాడు. రోజురోజుకీ క్షిణిస్తున్న తన రాజకీయ పలుకుబడి కాపాడుకోవడం ఈ ప్రకటనలో ఒక ఎత్తయితే, మోడీ తర్వాత బిజెపి సంగతేంటి అనే ప్రశ్నతో అంతర్లీనంగా అందరినీ ఆలోచనలో పడేసాడు.

ఇది వాస్తవం. ఎందుకంటే వాజపేయి శకం ముగిశాక అద్వానీ తెరమీదకొచ్చారు. కానీ ఆయన విఫలం అయ్యా క మోడీ అనివార్యంగా తెరమీద నిర్మించబడ్డారు. వాజ్‌ పేయి తరువాత బిజెపి ఎన్నుకొన్న అద్వానీ, మోడీ ఇద్దరిలో మతవాదం స్పష్టంగా కనబడుతుంది. దానిని బట్టే వారి ప్రాధాన్యత అర్థమవ్ఞ తుంది. మునుప్నెడూ ఏ నేతకిలేని ప్రచారం మోడీకి లభించింది. ఇప్పుడు బిజెపిఅంటే మోడీ, మోడీ అంటే బిజెపి అనేది నినాదం. కానీ ‘తరువాతెవ్వరు అనేది ఎవరికీ తెలియని. వారికే అంచనా లేని విషయం.అందుకే రాహుల్‌ వారిని ఈ ప్రకటనల ద్వారా ఆత్మ రక్షణలోకి నెట్టేసాడు.కారణం వారసత్వ రాజకీయాలకు గాలి పీల్చా ల్సినంత అనివార్యంగా అలవాటుపడ్డ భారత జనసమూహం నెహ్రూ,ఇందిరవారసులైన రాహూల్‌ గాంధీని, లే ేకుంటే ప్రియాంక గాంధీని ఎప్పటికైనా గట్టిగా గెలించుకుంటారని నమ్మకం. దేశంలో గుర్తింపు పొంది, వారసత్వప్రధాన సమస్యఎదుర్కొంటున్న పార్టీల్లో బిజెపి, బిఎస్పీ ప్రధానంగా ఉన్నాయి. ఇది వాస్తవం. మాయావతి ఇప్పుడు వారసత్వ సమస్య కంటే పార్టీని నిలబెట్టడమే సవాలుగా మారింది.ఆమె సమర్థురాలు తప్పకనిలబెడుతుంది.ఎందుకంటేఆమె కుటుంబ వారసత్వం నుండిరాలేదు. సిద్ధాంత వారసత్వం నుండి వచ్చింది. కానీ రానున్న తరంలో ఎవరికి రాజకీయ పగ్గాలు అనేది ఆమెనిర్ణయించుకోవాలి.

ఇక వామపక్షాలు వారసత్వాలకు దూరంగా ఉన్నట్టే కనబడుతుంది. ఇప్పుడూ వారిదీ అస్తిత్వ సమస్యే. ‘రాజ్యం ప్రజలు రాసిచ్చిన వారసత్వ హక్కులా భావించే పాలకు లున్నంత కాలం వారిని పూజించే ప్రజలున్నంత కాలం అధికారం ఆ కుటుంబాల మధ్యే నలుగుతుంటుంది. నీతి అవినీతి చర్చే లే ేకుండా అవగాహన మరచి వ్యక్తిగత అభిమానం హద్దే దాటిపోయాక రాజకీయ అధికారానికి పరిమితం గిరిగీయబడుతుంది. ఆ గిరిలో ఉన్న కుటుంబాలే బరిలో నిలుస్తాయి. ఇది భారతదేశంలో ప్రజా స్వామ్యం పేరుతో కొనసాగుతున్న రాజరికం. దేశంలో పేరుమోసిన రాజకీయ పార్టీలను చూస్తే వారి అధికారంతోపాటు ప్రజల అభిమా నం కూడా అమాయకత్వం అనే పాస్వర్డ్‌తో క్షణాల్లో బదిలీ చేసు కుంటారు. డీఎంకే స్టాలిన్‌ రూపంలో బతికిపోయింది. రాజశేఖర్‌ రెడ్డి జగన్‌ ద్వారా నిలబడిపోయారు.

కేటీఆర్‌, కవిత రూపంలో కేసీఆర్‌ నిలదొక్కుకున్నట్టే. చంద్రబాబు వారసుడిగా ప్రమోట్‌ అవ్ఞతున్న లోకేష్‌ ఇంకా నిలదొక్కుకోలేదు. కానీ సమీప కాలంలో వారసత్వ రగడ ఈ రెండు పార్టీలకి ఎదురవ్వబోతుంది. అఖిలేష్‌ ద్వారా ములాయం, తేజస్వి ద్వారా లాలూ, సుప్రియ ద్వారా శరద్‌, ఉద్ధవ్‌ ద్వారా శివసేన, తమ అస్తిత్వాలని నిలుపుకుంటున్నా యి. కుమార స్వామి దేవగౌడ వారసత్వాన్ని అందుకున్నారు. ఇక పంజాబ్‌లో బాదల్‌ ఫ్యామిలీ కథ తెలిసిందే. నవీన్‌ పట్నాయక్‌ రూపంలో బిజు కూడా బతికిపోయారు.

ఈ ప్రక్రియలో శాశ్వతమ వ్ఞతున్నది వ్యక్తులే కాదు ఆయా పార్టీలు, ఆ పార్టీలు స్థానికంగా ఏర్పాటు చేసుకున్న ఆధిపత్య కులాలు కూడా అధికారం వీరి మధ్యే తడవకోసారి బదిలీ అవ్ఞతుంది. ఎందుకంటే వారసత్వం ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిషెడ్‌ ఫార్ములా. ఈ నమ్మకాలు నేతలని ఎంతదాకా తీసుకెళ్తున్నాయి అంటే వాళ్లు ఎన్నేళ్లు అధికారంలో ఉండాలనుకుంటున్నారో ముందే చేప్పేసి వారి అభిమానులను సిద్ధం చేసుకునేదాకా. పార్టీల ప్రతినిధులు మాట్లా డుతూ ఇలా అంటున్నారు.100 ఏళ్లు అధికారమే లక్ష్యం అంటున్నా రు పన్నీర్‌ సెల్వం.

ఇదిలాఉంటేే 20 ఏళ్లు అధికారంలో ఉండడం టిడిపి లక్ష్యం. 30 ఏళ్లు అధికారంలో ఉండటం వైసీపీ లక్ష్యం. 20 ఏళ్లు అధికారం మాదే అని టిఆర్‌ఎస్‌ పార్టీలు ప్రకటనలిస్తున్నాయి. ఒకొక్కరు ఇన్నేళ్లు అన్నేళ్లు అని ఎలా పంచేసుకుంటున్నారో అని ఓటరుకి ఆలోచన కూడా లేకుండాపోయింది. వారికి కావాల్సిందల్లా వారి అభిమాన నాయకుని కొడుకు లేదా కూతురు లేదా కుటుంబం అధికారంలోకి వచ్చారా? లేదా? అనే. ఈ పార్టీల్లో కొందరు అవి నీతి ఆరోపణలు ఎదుర్కొంటుంటే కొందరు ప్రభుత్వాలు నిలుపు కోడానికి ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు తమ కండువా కప్పేస్తున్నారు.

అధికారంలోకి రావడానికి బలం పెంచుకోవడానికి నానా బాధలు పడుతున్న వారు 20ఏళ్లు, 30ఏళ్లే ప్రకటిస్తుంది మోసేవాళున్నా రుగా అనే నమ్మకంతోనే. వారి మీదున్న ఆరోపణలతో, వారి విధా నాలతో ప్రజలెవ్వరూ తమకి పనే లేదన్నట్టుగా నిమ్మకినీరెత్తినట్టు తయారయ్యారు. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి. సోషల్‌ మీడియాలో ఆంధ్రప్రదేశ్‌ సిఎం చంద్రబాబు నాయుడు ఫొటో, ఆయన కుమారుడు లోకేష్‌ ఫొటోలోక్‌ష్‌ కుమారుడు దేవాన్ష్‌ ఫొటో పెట్టి ఆంధ్రాను పాలించేది శాశ్వతంగా వీరే అనిరాస్తూ దేవాన్ష్‌ భవి ష్యత్తు సీఎం అని రానున్న పోస్టులు హల్చల్‌ చేస్తున్నాయి. బహుశా అది వారి అభిమానం కావొచ్చు. కానీ అది తరతరాల వారసత్వానికి ముందుగానే సిద్ధపడ్డ ఒక వారసత్వ ఓటరు అభిప్రాయం. ఇదిలా ఉంటే తుమ్మితే ఊడే ముక్కులా ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వంకు జయలలిత మరణం తరువాత వందేళ్లు అధికారం ఎలా సాధ్యమో పన్నీరు చెప్పాలి. జయలలితకు రాజకీయ వారసులు లేరు.

ఆమె ఆ ప్రకటనలు చేయలేదు. ఇప్పుడు అందరూ ఆమెని వారసత్వం గురించి ప్రకటించని నేతగాగుర్తించేకంటే పార్టీకి పెద్దదిక్కు నిర్ణయిం చకుండా వెళ్లిపోయారు అనే ఆలోచిస్తున్నారు. కారణం వారసత్వ పల్లకి మోయాలని సిద్ధంగా ఉన్న పల్లకిలో రాజో లేక రాణో లేరని వారిబాధ. ఇది ప్రజల నేటి మానసిక స్థితి. ఇదేకాదు దేశంలో అన్ని రంగాల్లో వారసత్వం ఉంది. ఇక ప్రైవేట్‌ వ్యాపారంలో అయితే మరొకరికి హక్కేలేదు అన్నట్టుగా ఉంటుంది ఈ వైఖరి. ప్రజలకు రాజకీయం తర్వాత అంత దగ్గరగా ఉండేది సినీ రంగమే.

ఆ రం గంలో కూడా వారసత్వం తప్ప మరొకటి కనబ డదు. ఇక కనబడ్డా ఎక్కువ కాలం నిలవదు లేదా ఒకవేళ నిలదొక్కుకుంటే మానసికంగా నిలకడగా బతకదు.చివరికి భౌతికంగా మిగలదు.హీరోల వారసుల్ని మోయడం ‘మా జన్మహక్కు అని భావించే అభిమానులు ఉన్నంత కాలం వారికి ఢోకాలేదు. వారసత్వ పల్లకీమోతకి, ఈ మానసిక సంసిద్ధత అన్నిరంగాల్లో గ్రహించాడు కాబట్టే దాన్ని తన రాజకీయ అడ్వాంటేజ్‌ కోసం ప్రకటించారు రాహుల్‌గాంధీ. ఇక 50 ఏళ్ల అధికారం కలగంటున్న అమిత్‌షా వ్యూహం ఏమిటో తెలియాలి.

కానీ ఇప్పటి ప్రశ్న మోడీ తరువాత ఎవరు అనేదానికి సమాధానం ఎర్రర్‌ 404 మాత్రమే. ఇప్పుడు వారి మదిలో కూడా ఆలోచనలు మెదిలే ఉంటాయి.అనేక సంవత్సరాల తర్వాత భారతదేశ ప్రజలకు అందిన సువర్ణ అవకాశం ఇది. ఎందుకంటే రాజకీయాల్లో ఉద్ధండ పిండాలుగా పేరున్నవారు విశ్రాంతికి సిద్ధమవ్ఞతున్నారు. వారసత్వా లు నిస్సందేహంగా మోస్తున్న ప్రజలు ఇకనైనా ఈ సమయం కల్పించిన అవకాశం ఉపయోగించుకొని వాస్తవ సిద్ధాంతాలు మోయడం ప్రజాస్వామ్యా నికి ఎంతో శ్రేయస్కరం.ఇవేమీ పట్టనట్టు మళ్లీ పల్లకి మోతకు సిద్ధమైతే ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెడుతూనే ఉంటారు ప్రజాస్వామ్యానికి వారసత్వ వాతలు.

– పచ్చల రాజేష్‌

(రచయిత: రీసెర్చ్‌ స్కాలర్‌ ఆచార్య నాగార్జున వర్శిటీ)